Best Ayurvedic Food For Women : ఇంటి ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. కానీ.. చాలా మంది మహిళలు అటు ఉద్యోగం చేస్తూ.. ఇటు ఇంటిపని చేస్తూ.. తీవ్రంగా అలసిపోతున్నారు. తమ ఆరోగ్యం గురించి పట్టించుకోవట్లేదు. దీనికితోడు మహిళల్లో వయసు రీత్యా వచ్చే సమస్యలు చాలానే ఉంటాయి. నెలసరి సరిగా రాకపోవడం, నెలసరిలో నొప్పి, అధిక రక్తస్రావం, శారీరక బలహీనత, నీరసం, ఊబకాయం, థైరాయిడ్, మెనోపాజ్ లాంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. అయితే.. వీటన్నింటినీ అధిగమించడానికి, శారీరకంగా బలంగా ఉండటానికి.. మహిళలు తప్పనిసరిగా వారి ఆహారంలో కొన్ని పదార్థాలు చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ పదార్థాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
1.కొబ్బరి(Coconut) :
కొబ్బరి.. వాత, పిత్త దోషాలను సమతుల్యంగా ఉండేలా చేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. శరీర బలాన్ని పెంచడంలో, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో, థైరాయిడ్ పనితీరును మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుందని చెబుతున్నారు. కొబ్బరి శరీరానికి చలువ చేస్తుంది కాబట్టి, ప్రతిరోజూ ఓ చిన్న ముక్కను తింటే మంచిదని సూచిస్తున్నారు.
2.నల్ల ఎండుద్రాక్ష(Black raisins) :
నల్ల ఎండుద్రాక్షలో పొటాషియం, క్యాల్షియం దండిగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పెళుసు బారకుండా కాపాడతాయని అంటున్నారు. ఇందులో ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది. ప్రేగులను శుభ్రం చేయటం, లైంగిక సామర్థ్యాన్ని పెంచటం, నెలసరి సమస్యలు పరిష్కరించడంలో ఎండుద్రాక్ష తోడ్పడుతుంది. వీటిలో ఐరన్‌తోపాటు విటమిన్ C కూడా ఉంటుంది. శరీరం ఖనిజాలను త్వరగా గ్రహించుకోవటానికి విటమిన్ C తోడ్పడుతుందని, దీనివల్ల వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయని చెబుతున్నారు.
నల్ల ఎండుద్రాక్షలో ఐదు వృక్ష రసాయనాలు, ఓలియానోలిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి పళ్లు పుచ్చిపోకుండా కాపాడుతున్నట్టు అమెరికాలో నిర్వహించిన పరిశోధనలు చెబుతున్నాయి. మహిళలు ఉదయాన్నే నల్ల ఎండుద్రాక్షలను తినడం వల్ల బోలెడు రోగాలు దూరమవుతాయి. ఇది పిత్త దోషాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
చపాతీలు మృదువుగా రావాలా? - పిండిలో ఇవి కలిపితే చాలు - భలే స్మూత్‌గా వస్తాయి!
3. నువ్వులు(sesame) :
రోజూ వారి ఆహారంలో నువ్వులను తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థ నుంచి కండరాలు, ఎముకల ఆరోగ్యం వరకు అన్ని సమస్యలూ పరిష్కరమవుతాయి. నువ్వులు వాత సమస్యలను దూరం చేస్తాయి. నెలసరి రావడానికి 15 రోజుల ముందు ప్రతిరోజూ ఒక టీస్పూన్ వేయించిన నువ్వులు తింటే నెలసరి సమస్యలన్నీ తగ్గిపోతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
4.ఖర్జూరం(Dates) :
మహిళలల్లో వచ్చే రక్తహీనత సమస్యను ఖర్జూరం దూరం చేస్తుంది. అలసట, నీరసం, ఐరన్ లోపంతో బాధపడే మహిళలు, నెలసరి సమస్యలు ఉన్నవారు ప్రతిరోజూ ఖర్జూరం తినడం వల్ల మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
కంటి నిండా నిద్రపోవాలా? మీరు తీసుకోవాల్సిన బెస్ట్ ఫుడ్ ఇదే!
5.ఉసిరి(Gooseberry) :
ఆయుర్వేదంలో ఉసిరికి ప్రముఖ స్థానం ఉంది. అన్ని వయసుల మహిళలూ ఉసిరిని ఆహారంలో తీసుకోవాలి. ఉసిరి పొడి, ఉసిరి జ్యూస్, ఉసిరి క్యాండీ, పచ్చి ఉసిరి ఇలా చాలా విధాలుగా తినవచ్చు. ఉసిరిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణాశయ సమస్యలను, మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. మహిళల్లో వచ్చే నెలసరి సమస్యలను తగ్గించడంలో, వారి ప్రత్యుత్పత్తి వ్యవస్థ సక్రమంగా పనిచేయటంలో ఉసిరి ఎంతో సహాయపడుతుంది. దీనితో కొన్ని రకాల క్యాన్సర్లకు కూడా చెక్ పెట్టొచ్చని నిపుణులు అంటున్నారు. రోజు ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు నీటిలో టేబుల్ స్పూన్ ఉసిరి పొడిని కలిపి తీసుకోడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు.
పెళ్లి తర్వాత బరువు పెరిగారా? - ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్ ఫిగర్ పక్కా!
బ్లాక్‌హెడ్స్‌తో ఇబ్బంది పడుతున్నారా?- ఈ టిప్స్ ఫాలో అయ్యి మీ సమస్యకు స్వస్తి పలకండి!