ETV Bharat / sukhibhava

విశ్రాంతి తీసుకునే యోగాతో.. ఆరోగ్య యోగం!

యోగా అంటే బద్ధకించేవాళ్లు కూడా బాగా ఇష్టపడే ఆసనం 'శవాసనం'. ఎందుకంటే ఎలాంటి కష్టం లేకుండా హాయిగా రిలాక్స్ కావచ్చు కదా..! మరి యోగా సెషన్ మొత్తం రిలాక్స్ కావడమే అయితే...? అవును, విశ్రాంతి తీసుకోవడమే ఆ యోగా ప్రత్యేకత... మరి అదేంటో తెలుకుని మీరు ట్రై చేయండి!

benefits-of-restorative-yoga-or-resting-yoga-aasans
విశ్రాంతి తీసుకునే యోగాతో.. ఆరోగ్య యోగం!
author img

By

Published : Jun 27, 2020, 10:30 AM IST

రెస్ట్​తో యోగా అనగానే ముందు కాస్త సంతోషపడ్డా తర్వాత ఇందులో ఏదో తిరకాసు ఉందని అనుమానిస్తారు కదూ..! మీకా అనుమానం అవసరం లేదు. సాధారణ విశ్రాంతి భంగిమలకే కొంత యోగా ఫ్లేవర్​ ఇచ్చి అద్భుతమైన ఫలితాలను పొందచ్చట. ఈమధ్యే పాపులర్ అవుతున్న 'రెస్టొరేటివ్ యోగా' గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

ఎక్కడిదీ రెస్టొరేటివ్ యోగా..?

1950ల్లో మన యోగశాస్త్రాన్ని పాశ్చాత్య దేశాలకు ప్రచారం చేసిన బి.కె.ఎస్.అయ్యంగార్ ఈ రెస్టోరేటివ్ యోగాను కనిపెట్టారు. ఆయన శిష్యులలో మొదటితరం వారైన జుడిత్ హాన్సన్ లాసేటర్ ఈ రెస్టొరేటివ్ యోగాని ప్రచారంలోకి తీసుకువచ్చారు. 1955లో ఆమె రాసిన 'రిలాక్స్ అండ్ రెన్యూ: స్ట్రెస్‌ఫుల్ టైమ్స్ కోసం రెస్ట్‌ఫుల్ యోగా' అనే పుస్తకం ఇందుకు ఎంతగానో తోడ్పడింది. తర్వాత ఆమె రెస్టొరేటివ్ యోగాలో స్పెషల్ టీచర్ సర్టిఫికేషన్‌ని కూడా ప్రవేశపెట్టారు.

benefits-of-restorative-yoga-or-resting-yoga-aasans
విశ్రాంతి తీసుకునే యోగాతో.. ఆరోగ్య యోగం!

అసలేమిటీ రెస్టొరేటివ్ యోగా..

  • మన శరీర తత్వాన్ని బట్టి, ఫ్లెక్సిబులిటీని బట్టి రకరకాల యోగాసనాలను సాధన చేస్తాం. మనం ఆశించిన ఫలితాలను పొందడానికి, శరీరాన్ని నిత్యం ఆరోగ్యంగా ఉంచడానికి క్రమం తప్పకుండా యోగ సాధనను కొనసాగిస్తాం. అలాగే మానసిక ప్రశాంతత కోసం, ఏకాగ్రత కోసం ధ్యానాన్ని సాధన చేస్తాం. ఈ రెండిటి ప్రయోజనాలనూ ఏకకాలంలో అందించగలగడం రెస్టొరేటివ్ యోగా ప్రత్యేకత.
  • యోగా చేసేటప్పుడు ఎక్కువసేపు ఒకే పొజిషన్‌లో ఉండడం వల్ల శరీరానికి ఆ భంగిమను నెమ్మదిగా అలవాటు చేస్తూ అందులోని పూర్తి లాభాలను పొందడమే రెస్టొరేటివ్ యోగా ఫార్ములా. శరీరానికి, మనసుకు విశ్రాంతినిస్తూనే అధికబరువును తగ్గించడం రెస్టొరేటివ్ యోగా సక్సెస్ కావడానికి ప్రధాన కారణం.

రెస్టొరేటివ్ యోగా ఉపయోగాలు..

  • కఠినమైన ఆసనాలతో పనిలేదు కాబట్టి ఏవయసులో ఉన్న వారైనా రెస్టొరేటివ్ యోగాను సాధన చేయవచ్చు.
  • అనేక రకాల మానసిక ఒత్తిళ్ల నుంచి, ఆందోళనల నుంచీ ఉపశమనం పొందవచ్చు.
  • డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక సమస్యలు అదుపులో ఉంటాయి.
  • రోగనిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది.
  • ఇన్‌సోమ్నియా అనే నిద్ర లేమి సమస్యను రెస్టొరేటివ్ యోగా నయం చేస్తుంది.
  • శరీరం ఫ్లెక్సిబుల్‌గా తయారవుతుంది.
  • ఈ యోగా వల్ల ఎటువంటి శారీరక ఒత్తిడి లేకుండా రక్త ప్రసరణ, శ్వాస ప్రక్రియ మెరుగుపడతాయి.
  • ఏకాగ్రతను పెంచడమే కాకుండా కోపాన్ని అదుపులో ఉంచి ఆలోచనా శక్తిని పెంచుతుంది ఈ యోగసాధన.
  • ఒత్తిడి వల్ల శరీరంలోని వివిధ భాగాలలో వచ్చే నొప్పులను, కండరాల నొప్పులను తగ్గిస్తుంది.
  • రెస్టొరేటివ్ యోగా వల్ల శరీరంలో పేరుకున్న మలినాలు, అధిక కొవ్వు నిలవలు తొలగిపోతాయి.
  • కేవలం 5 నుంచి 20 నిమిషాల రెస్టొరేటివ్ యోగా సెషన్ మీ బిజీ లైఫ్ కి ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తుంది.

బాలాసనం..

తుంటి, తొడ, మోకాళ్లు, చీలమండల దగ్గర ఉండే కండరాలను బలపరిచి రక్త ప్రసరణను పెంచడానికి బాలాసనం ఎంతో ఉపయోగ పడుతుంది. ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతకు దోహదపడుతుంది. అంతేకాకుండా బాలాసనం సాధన చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వెంట్రుకల కుదుళ్లు బలంగా తయారవుతాయి.

వీటిని సిద్ధం చేసుకోవాలి..

  • ఒక దుప్పటి లేదా యోగా మ్యాట్.
  • 12 అంగుళాల వెడల్పు ఉండి, మీ నడుము భాగంనుండి తల వరకు ఆనించడానికి సరిపడేంత పొడవుతో ఐదు దుప్పట్లను లేదా రెండు దిండ్లను పేర్చుకోవాలి. మోకాళ్లపై నిలబడినప్పుడు ఇవి నేలపైనుండి మీ నడుము ఎత్తులో ఉండేలా చూసుకోవాలి.
  • ఇలా కుదరని పక్షంలో రెండు ఇటుకలను పేర్చుకుని, వాటి మీదుగా ఒక మెత్తని ఎత్త్తెన దిండుని ఏటవాలుగా అమర్చుకోవాలి.

బాలాసనం ఎలా వేయాలి..?

  • ముందుగా దుప్పటి లేదా యోగా మ్యాట్‌ని పరుచుకోవాలి.
  • మోకాళ్లపై కూర్చుని, ముందే తయారు చేసి పెట్టుకున్న ఎత్తుని ఎదురుగా అమర్చుకోవాలి.
  • ఇప్పుడు ఆ ఎత్త్తెన దిండుపై తల, ఛాతీ భాగం, పొట్ట ఆనించాలి. రెండు చేతులని ఇటుకలకు, దిండుకు మధ్యలో ఉంచుతూ దిండుని హత్తుకోవాలి.
  • మోకాళ్ల మధ్యన దిండు ఉండేలా సరిచూసుకోవాలి.
  • కటి భాగం మడమలని తాకేలా కిందకు ఆనించాలి.
  • కనీసం 10నిమిషాలు ఈ ఆసనాన్ని సాధన చేయడం వల్ల దీని పూర్తి ప్రయోజనాలను పొందవచ్చు.

ఇదీ చదవండి: అతిగా కూర్చోవటం, పొగ తాగడం ఒక్కటేనట తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.