ETV Bharat / sukhibhava

అరటికాయ పిండితో ఎన్నో లాభాలున్నాయండి!

author img

By

Published : Jul 16, 2020, 1:18 PM IST

హార్మోన్ల అసమతుల్యత, సంతానలేమి.. ప్రస్తుతం చాలామంది మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో ఇవి ముందు వరుసలో ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యలకు వైద్య చికిత్సతో పాటు మన వంటింట్లోనే మరో పరిష్కారం ఉంది. మనం ఎంతో ఈజీగా తయారు చేసుకోగలిగే అరటికాయ పిండి వల్ల మహిళల్లో పునరుత్పత్తి వ్యవస్థ పటిష్టంగా ఉండడమే కాదు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్‌. మరి ఆ ఫలితాలేంటో, ఎలా పొందాలో తెలుసుకుందాం రండి...

banana-flour-for-womans-health
అరటికాయ పిండితో ఎన్నో లాభాలున్నాయండి!

రుజుతా దివేకర్‌.. ముంబయికి చెందిన ఈ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు.. కరీనా కపూర్‌, అలియా భట్‌తో పాటు పలువురు బాలీవుడ్‌ ముద్దుగుమ్మలకు ఆరోగ్యకరమైన ఆహార నియమాలు సూచిస్తుంటారు. అంతేకాదు.. కరీనా గర్భంతో ఉన్నప్పుడు చక్కటి ఆహార నియమాలు సూచించడం, ప్రసవానంతరం ఆమె కొన్ని రోజుల్లోనే తిరిగి బరువు తగ్గి ఫిట్‌గా మారడంలో రుజుత డైట్‌ ప్లాన్‌ ఎంతో కీలకం అని చెప్పొచ్చు. ఈ విషయాన్ని కరీనా పలు సందర్భాల్లో వెల్లడించిన సంగతి కూడా తెలిసిందే. ఇలా సెలబ్రిటీలకే కాదు.. మనలాంటి సామాన్యులకు సైతం ఆరోగ్యకరమైన ఆహార నియమాలు, సీజన్‌ను బట్టి వివిధ రకాల పదార్థాలు-వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, వ్యాయామాలు.. వంటివన్నీ సూచిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతుంటారు రుజుత. అలా తాజాగా బనానా ఫ్లోర్‌-అందులో దాగున్న ఆరోగ్య రహస్యాల గురించి వివరిస్తూ ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారీ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్‌.

banana-flour-for-womans-health
అరటికాయ పిండితో ఎన్నో లాభాలున్నాయండి!

పండే కాదు.. ఇవీ తీసుకోవాలి!

banana-flour-for-womans-health
పండే కాదు.. ఇవీ తీసుకోవాలి!

అరటి పండు.. అన్ని కాలాల్లోనూ అందరికీ అందుబాటులో ఉండే పండు. విటమిన్‌ 'సి'తో పాటు పొటాషియం, మాంగనీస్‌.. వంటి ఖనిజాలు నిండి ఉన్న ఈ పండును తినడం అటు ఆరోగ్యానికి, ఇటు అందానికీ ఎంతో మంచిది. అయితే దీన్ని కేవలం పండు రూపంలోనే కాకుండా అరటికాయ, అరటి పువ్వు, అరటికాయతో తయారుచేసిన పిండి (బనానా ఫ్లోర్‌).. వంటివి తీసుకోవడం కూడా మన ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు రుజుత. ఈ క్రమంలో బనానా ఫ్లోర్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరిస్తూ ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారామె. తన తల్లి రేఖా దివేకర్‌ బనానా ఫ్లోర్‌తో తయారుచేసిన థాలీపీట్‌ ఫొటోను ఇన్‌స్టాలో పంచుకున్న రుజుత.. ఈ పిండిని ఎలా తయారుచేసుకోవాలి, థాలీపీట్‌ తయారీ, బనానా ఫ్లోర్‌లో దాగున్న ఆరోగ్య రహస్యాల గురించి సుదీర్ఘమైన క్యాప్షన్‌ రాసుకొచ్చారు.

సంతానోత్పత్తి కోసం..

banana-flour-for-womans-health
సంతానోత్పత్తి కోసం..

బనానా ఫ్లోర్‌ థాలీపీట్‌ ఫొటోను ఇన్‌స్టాలో పంచుకున్న రుజుత.. "బనానా ఫ్లోర్‌తో మన ఆరోగ్యానికి బోలెడన్ని ప్రయోజనాలు చేకూరతాయి. ముఖ్యంగా..

  • ఒత్తిడి, ఆందోళనలతో సతమతమయ్యే మన మనసును తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి సహకరిస్తుంది.
  • స్త్రీలలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది.
  • రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడుతుంది.
  • జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
  • పేగుల ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.
  • హార్మోన్లను నియంత్రించడంలో సహకరిస్తుంది.

ఈ బనానా ఫ్లోర్‌ను ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అంతేకాదు.. మనందరి వంటింట్లో ఉండే అతి ముఖ్యమైన పదార్థం. అంతేకాదు.. ఇది మార్కెట్లో చాలా తక్కువ ధరకే లభిస్తుంది. అరటికాయ ముక్కల్ని రెండుమూడు రోజులు ఎండలో బాగా ఎండబెట్టి దీన్ని తయారుచేసుకోవచ్చు. అలాగే ఈ పిండితో థాలీపీట్‌ తయారుచేయడం కూడా ఈజీనే! ఆ రెసిపీని మా అమ్మ తన ఇన్‌స్టా పేజీలో పోస్ట్‌ చేసింది. తక్షణ శక్తిని, సంతానోత్పత్తిని పెంచే ఈ పిండిని మీరూ తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోండి. అలాగే అరటికాయ, పండ్లు, అరటి పువ్వు.. వంటివి కూడా క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి. తద్వారా బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి.." అంటూ చెప్పుకొచ్చారీ న్యూట్రిషనిస్ట్‌.

banana-flour-for-womans-health
బనానా ఫ్లోర్‌ ఎలా తయారుచేయాలి?

బనానా ఫ్లోర్‌ ఎలా తయారుచేయాలి?

బనానా ఫ్లోర్‌ తయారీ, దాంతో థాలీపీట్‌ ఎలా తయారుచేసుకోవాలో రుజుత తల్లి రేఖా దివేకర్‌ తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. ఎండబెట్టిన అరటికాయ స్లైసెస్‌, బనానా ఫ్లోర్‌తో తయారుచేసిన థాలీపీట్ ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకున్న ఆమె.. బనానా ఫ్లోర్‌, థాలీపీట్‌లను చాలా ఈజీగా తయారుచేసుకోవచ్చంటూ వాటి రెసిపీలను క్యాప్షన్‌గా రాసుకొచ్చారు.

బనానా ఫ్లోర్‌ థాలీపీట్‌

ముందుగా బనానా ఫ్లోర్‌ తయారీ గురించి తెలుసుకుందాం.. ఇందుకోసం ముందుగా కొన్ని అరటికాయల్ని తీసుకోవాలి. వాటిపై ఉండే తొక్క తొలగించి చిన్న చిన్న స్లైసుల్లా కట్‌ చేసుకోవాలి. వీటిని రెండుమూడు రోజుల పాటు ఎండలో ఆరబెట్టాలి. బాగా ఆరిన తర్వాత మిక్సీ పట్టుకుంటే సరి. ఈ పిండిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు. ఈ గ్లూటెన్‌-ఫ్రీ పిండితో వెరైటీ బ్రేక్‌ఫాస్ట్‌లు తయారుచేసుకోవచ్చు. అలాంటిదే ఈ బనానా థాలీపీట్‌ కూడా!

కావాల్సిన పదార్థాలు

  • బనానా ఫ్లోర్‌ - కప్పు
  • బంగాళాదుంపలు - నాలుగైదు (ఉడికించి, పొట్టు తొలగించి, మ్యాష్‌ చేసుకొని పెట్టుకోవాలి)
  • పచ్చిమిర్చి - 2 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
  • జీలకర్ర పొడి - టీస్పూన్‌
  • పల్లీ పొడి - అరకప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా

తయారీ

పైన పేర్కొన్న పదార్థాలన్నీ ఒక బౌల్‌లోకి తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ వడల పిండిలా (మరీ జారుడుగా, మరీ గట్టిగా కాకుండా) తయారుచేసుకోవాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా పిండిని తీసుకొని గుండ్రంగా ఒత్తుకోవాలి. వీటిని పెనంపై వేసి నెయ్యితో ఇరువైపులా కాల్చుకుంటే బనానా ఫ్లోర్‌ థాలీపీట్‌ రడీ. ఈ థాలీపీట్‌ని కొబ్బరి చట్నీ లేదా నువ్వుల చట్నీతో లాగించేయచ్చు.. అంటూ రెండు రెసిపీల గురించి వివరించారు రేఖ.

మరి, రుజుత చెప్పినట్లు.. తక్షణ శక్తిని అందిస్తూనే, బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఈ బనానా ఫ్లోర్‌ని మనమూ రోజువారీ ఆహారంలో భాగం చేసుకుందాం.. హెల్దీగా మారిపోదాం..!

banana-flour-for-womans-health
రుజుతా దివేకర్‌..

ఇదీ చదవండి: బామ్మల కాలం నాటి 'వేపాకు ఫార్ములా'​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.