ETV Bharat / sukhibhava

అమ్మలూ.. రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ఈ 'ఫుడ్​ ప్లాన్'​ పాటించేయండి! - పోషకాహారం ప్లాన్​

సరైన పోషకాహారం తీసుకునే విషయంలో అమ్మాయిలే కాకుండా అమ్మలు కూడా కాస్త వెనకే ఉంటున్నారని చెబుతున్నాయి పలు సర్వేలు. రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే శరీరానికి సమతులాహారం అందాలి అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వారు చెబుతున్న 'ఫుడ్ ప్లాన్​' మీకోసం!

balanced-nutrition-food-plan-for-women
balanced-nutrition-food-plan-for-women
author img

By

Published : Dec 29, 2022, 8:13 AM IST

అమ్మాయిలే కాదు అమ్మలూ.. సరైన పోషకాహారం తీసుకునే విషయంలో ఒకింత వెనకే ఉంటున్నారంటున్నాయి సర్వేలు. రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే శరీరానికి సమతులాహారం అందాలంటారు పోషకాహార నిపుణులు.
అల్పాహారం కాస్త ఎక్కువైనా తప్పులేదు. నూనెలేని ఇడ్లీ, దోశ వంటివి ఏవైనా ఓకే. అయితే దాంతో పాటు రెండు చొప్పున ఖర్జూరాలూ, గుడ్లూ తీసుకోండి. ఓ గ్లాసు పాలు తాగేయండి. ఇవి రోజంతా చురుగ్గా ఉండటానికి కావలసిన పోషకాల్ని అందిస్తాయి.

మధ్యాహ్నం భోజనంలో సాధ్యమైనంతవరకూ ఆకుకూరలు, కాయగూరలు, బఠాణీలూ, బీన్స్‌, పుట్టగొడుగులూ, పప్పు ధాన్యాలూ గుడ్లూ, చేపలూ, చికెన్‌ వంటివి ఉండేలా చూడొచ్చు. అయితే ఒకే తరహా ఆహారాన్ని రోజూ తినే పద్ధతి వద్దు. ఒక్కో రకం పదార్థం నుంచి ఒక్కో పోషకం కీలకంగా ఉండొచ్చు. అందుకే అన్ని రకాలూ.. మార్చి మార్చి తీసుకోవాలి. రోజూ ఓ కప్పు పెరుగు తినడం మాత్రం మరిచిపోవద్దు. అప్పుడే పోషకాహార లేమి ఉండదు. జీవక్రియల పనితీరూ మెరుగుపడుతుంది.

మధ్నాహ్న భోజనమయ్యాక సాయంత్రం ఆకలి పిలుస్తూ ఉంటుంది. ఆ సమయంలో నాలుగైదు బాదం గింజలూ, మొక్కజొన్న, పండ్ల ముక్కలూ, చిరుధాన్యాల పిండితో చేసిన మురుకులూ, బెల్లం వేరుశెనగ అచ్చు.. వంటివి ఉంటే కడుపూ నిండుతుంది. పోషకాలూ, పీచూ వంటివి శరీరానికి అందుతాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.