ETV Bharat / sukhibhava

హైపర్ ​ఎసిడిటీ సమస్యా? - ఈ ఆయుర్వేద పదార్థాలతో తగ్గించుకోండి! - ayurveda for hyperacidity

Ayurvedic Food to Reduce Hyperacidity : ఎసిడిటీ సమస్యతో సతమతమయ్యేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆహారం తీసుకున్న వెంటనే కడుపులో మంటగా అనిపించడం, పుల్లటి తేనుపులు రావడం, గుండె బరువుగా అనిపించడం, వికారం వంటివన్నీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ లక్షణాలే. ఈ సమస్య నుంచి బయటపడేందుకు తీసుకోవాల్సిన ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

Ayurvedic Food to Reduce Hyperacidity
Ayurvedic Food to Reduce Hyperacidity
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 9, 2023, 1:50 PM IST

Ayurvedic Food to Reduce Hyperacidity in Telugu: మారిన జీవనశైలి, బయట ఫుడ్స్ ఎక్కువగా తీసుకునే అలవాటు కారణంగా చాలా మంది ఎదుర్కొనే సమస్య ఎసిడిటీ. ఇది ముదిరితే హైపర్ ఎసిడిటీగా మారుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది శాశ్వత ఒత్తిడి కారణంగా కూడా జరుగుతుందని చెబుతున్నారు. అనేక ఇతర ఆరోగ్య సమస్యలకూ దారి తీయవచ్చంటున్నారు.

పొట్టలో పుండ్లు, యాసిడ్ రీఫ్లక్స్ ని హైపర్ ఎసిడిటీ అని పిలుస్తారు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, మద్యపానం, అధిక ధూమపానం, ఇతర జీవనశైలి అలవాట్లు కారణం పొట్ట లైనింగ్ దెబ్బతిని వాపు సంభవిస్తుంది. ఇది తీవ్రమైన కడుపులో మంటని కలిగిస్తుంది. ఎన్ని రోజులైనా ఏం చేసినా కడుపులో మంట తగ్గదు. ఏది తినలేక, ప్రశాంతంగా నిద్ర కూడా పోలేక తీవ్ర ఇబ్బంది అనుభవిస్తూ ఉంటారు. కడుపులో మంటతో పాటు గ్యాస్ సమస్య కూడా బాధిస్తుంది. కడుపు ఉబ్బరంగా మారి ఏం తినాలన్నా, ఏ పని చెయ్యాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్య నుంచి బయట పడేందుకు ఆయుర్వేదంలో సూచించిన మూడు సహజ పదార్థాలతో తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి పొట్టలోని ఆమ్లత్వాన్ని తగ్గిస్తాయంటున్నారు. అవి ఏంటంటే..

బరువు తగ్గడానికి "వాటర్ థెరపీ" - జస్ట్ నీళ్లు తాగితే చాలు కొండలాంటి పొట్ట వెన్నలా కరిగిపోతుంది!

ధన్యక్ హిమ: ఆయుర్వేదం ప్రకారం ధన్యక్ అంటే కొత్తిమీర గింజలు లేదా ధనియాలు. ఇవి పిత్త దోషాన్ని తగ్గిస్తాయి. ఆమ్లత్వాన్ని అదుపులో ఉంచుతాయి. జీర్ణక్రియని మెరుగుపర్చడంలో ప్రభావవంతంగా పని చేస్తాయి. ఈ విత్తనాలు తీసుకుంటే ఆపానవాయువు, ఉబ్బరం సమస్యని తగ్గిస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఒక టీ స్పూన్ ధనియాలు తీసుకుని ఒక కప్పు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఆ నీటిని తెల్లారి వడకట్టి ఖాళీ కడుపుతో తాగేయాలి. ఇది ఎసిడిటీ సమస్య మాత్రమే కాదు బరువు తగ్గించేందుకూ దోహదపడుతుంది. ఒంట్లో ఉన్న కొవ్వును కరిగించేస్తుంది.

ఫెన్నెల్ సీడ్స్(సోంపు), రాక్ షుగర్: నిపుణుల అభిప్రాయం ప్రకారం సోంపు గింజలు నమలడం ఆరోగ్యకరమైన అలవాటు. ఇందులో యాంటీ అల్సర్ లక్షణాలు కడుపులోని పొరని చల్లబరుస్తాయి. జీర్ణవ్యవస్థకి ఉపశమనం కలిగిస్తాయి. సోంపు గింజల్లో ఉండే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్.. హైపర్ ఎసిడిటీని నియంత్రించడంలో ఉపయోగపడతాయి. ఒక టీ స్పూన్ సోంపు గింజలు, రాక్ షుగర్ తీసుకుని బాగా కలుపుకోవాలి. వాటిని భోజనం చేసిన తర్వాత తినాలి. రోజుకు రెండు సార్లు తింటే మంచిది. ఆహారం అరుగుదలకి సోంపు గింజలు చక్కగా ఉపయోగపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి. సోంపు గింజల నీటిని తాగడం వల్ల కళ్లకు చాలా మేలు జరుగుతుంది.

కూరలో కారం, ఉప్పు ఎక్కువైతే మీరేం చేస్తారు? - ఇలా ఈజీగా లెవల్ చేయొచ్చు!

బ్లాక్​ కిస్మిస్: బ్లాక్ కిస్మిస్​లో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి. ఆమ్లత్వం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఖాళీ పొట్టతో ధనియాల నీరు తాగిన తర్వాత 10 నల్ల ఎండు ద్రాక్ష తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఫినాలిక్ సమ్మేళనాల గొప్ప మూలం. యాంటీ ఏజింగ్, యాంటీ ఇన్ఫ్లమేషన్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. కార్డియోవాస్కులర్ వ్యాధుల్ని తగ్గిస్తుంది. ఎటువంటి కొవ్వులూ ఇందులో లేవు. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్ లతో నిండి ఉంటుంది.

ఉల్లిపాయలు ఇలా తీసుకుంటే- డయాబెటిస్​కు చెక్​!

నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతుందా ? ఈ హోమ్​మేడ్​ టిప్స్​తో రిలీఫ్​ పొందండి!

తలనొప్పి తగ్గడం లేదా? ఈ టీ లు ట్రై చేస్తే చిటికెలో మాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.