Avoid Drinking Tea or Coffee With an Empty Stomach : టీ లేదా కాఫీ.. ఈ పేరులోనే ఓ వైబ్రేషన్ ఉంది. దీని పేరు చెప్తే చాలు.. చాలా మందికి ఎక్కడలేని ఎనర్జీ వస్తుంది. టైం తో సంబంధం లేకుండా.. చాలా మంది వీటిని తీసుకుంటారు. అంతే కాకుండా.. కొంచెం అలసటగా ఉన్నా.. తలనొప్పి వచ్చినా.. నలుగురు కలిసినా.. కప్పు టీ లేదా కాఫీ గొంతు జారాల్సిందే. అయితే.. ఉదయాన్నే వీటిని తీసుకోవడంపై హెచ్చరిక చేస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం ప్రమాదకరమని చెబుతున్నారు. ఉదయం లేవగానే పరగడపున టీ తాగేముందు ఓ చిన్న పని చేయాలని సూచిస్తున్నారు. మరి, అదేంటో ఇప్పుడు చూద్దాం.
మౌత్ గార్డ్‌తో నిద్రపోతున్నారా..? ఏం జరుగుతుందో తెలుసా??
Tea or Coffee Side Effects in Telugu: రాత్రి నుంచి ఏమీ తినకుండా.. ఉదయాన్నే వేరే ఏదీ తీసుకోకుండా.. టీ లేదా కాఫీ తాగడం వల్ల.. పేగులపై ప్రభావం పడుతుంది. దీనివల్ల ఆకలి తగ్గిపోవడంతోపాటు.. జీర్ణ క్రియ కూడా నెమ్మదిగా మారుతుంది. టీ లేదా కాఫీని పరగడుపున తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్ (gas) సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చస్తున్నారు.
ఖాళీ కడుపుతో కాఫీ లేదా టీ తాగడం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది శరీరంలో అనేక ప్రమాదకరమైన సమస్యలకు దారితీస్తుంది. అంతే కాకుండా అల్సర్, క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పు కూడా ఎక్కువని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అంతే కాకుండా.. దంతాలను కూడా దెబ్బతీసి.. దంత క్షయానికి కూడా కారణం కావచ్చని చెబుతున్నారు.
ఇలా నడిస్తే నష్టాలే! వాకింగ్‌లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు!
ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగినప్పుడు, అందులోని కెఫిన్ కంటెంట్ శరీరంలో డీహైడ్రేషన్‌ను పెంచుతుంది. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి టీ, కాఫీలు తాగే ముందు.. తప్పకుండా ఓ పని చేయాలని సూచిస్తున్నారు. అదే.. మంచి నీళ్లు తాగడం. దీని వల్ల రిస్క్ కొంత వరకు తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.
కాఫీ, టీకి ముందు నీరు తాగడం వల్ల పేగులలో ఒక పొర ఏర్పడుతుంది. అది టీ, కాఫీ వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తుంది. ఒకవేళ పరిగడుపున టీ-కాఫీ తాగే అలవాటు ఉంటే దానికి 15 నిమిషాల ముందు నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు. ఇంకా.. ఏదైనా(టిఫెన్) తిన్న తర్వాత వీటిని తీసుకుంటే సమస్య ఉండదని అంటున్నారు. ఈ ప్రక్రియ మీ శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చూశారుగా.. అవకాశం ఉన్న వారంతా ఇప్పటి నుంచి ఈ టిప్ ఫాలో అవ్వండి.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
బొప్పాయితో వారంలో 2కిలోల వెయిట్ లాస్! ఇందులో నిజమెంత? డాక్టర్లు ఏమంటున్నారు?
ఫ్రిడ్జ్ నుంచి వాటర్ లీక్ అవుతున్నాయా? ఇలా చెక్ పెట్టండి!
Ginger Side Effects In Telugu : అల్లాన్ని ఎక్కువగా వాడుతున్నారా?.. అయితే జాగ్రత్త సుమా!