Automatic Sperm Release Is Good Or Bad : శృంగారానికి సంబంధించిన చాలా విషయాల్లో అనేక మందికి చాలా అనుమానాలు ఉంటాయి. కానీ వాటి గురించి బహిరంగంగా ఎవరూ మాట్లాడుకోరు. అయితే మహిళలతోపాటు పురుషుల్లో ఇలాంటి అనేక అనుమానాలు తీర్చడానికి ఇప్పుడు ఇంటర్నెట్, వైద్యులు అందుబాటులో ఉన్నారు. మగవారిలో సాధారణంగా నిద్రలో లేదంటే మూత్ర విసర్జన సమయంలో వీర్యం పోతుంది. అయితే ఇది శరీరానికి మంచిదా? కాదా? ఎందుకు ఇలా అవుతుంది? అనే అనుమానాలు ఉంటాయి. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఆందోళన చెందాల్సిన అవసరం లేదు!
వీర్యంలో వీర్య కణాలు గర్భం రావడానికి ప్రధాన కారణమవుతాయి. అంతే తప్ప వీర్యంతో మరో ప్రయోజనం లేదని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా సెక్స్‌లో పాల్గొన్నప్పుడు వీర్యం బయటకు పోతుంది. వీర్యం విడుదలైనప్పుడు పురుషులకు భావ ప్రాప్తి కలుగుతుంది. ప్రస్తుతం చాలా మంది వృత్తి జీవితంలో తీరిక లేకుండా గడుపుతుండటం వల్ల సెక్స్‌లో సరిగా పాల్గొనలేకపోతున్నారు. యుక్త వయసులో పెళ్లి కానివారు ఎక్కువగా వీర్యం పోతుందని టెన్షన్ పడుతుంటారు. వాస్తవానికి వీర్యం ఏదో రకంగా బయటకు వెళ్లాల్సిందే. అదేమీ బలానికి సంబంధించినది కాదు కనుక వీర్యం ఎంతపోయినా బాధ పడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు నిపుణులు.
"ముఖ్యంగా పురుషులు శృంగారంలో పాల్గొన్నప్పుడు వీర్య స్కలనం జరుగుతుంది. అది సర్వసాధారణం. అలాకాకుండా నిద్రలో కూడా కొందరికి స్కలనం జరుగుతుంది. దీనిని 'స్పప్న స్కలనం' అని కూడా అంటుంటారు. అలా జరగడం వల్ల ఏదైనా అనారోగ్య సమస్య వస్తుందని చాలా మంది ఆందోళన చెందుతుంటారు. అది అపోహే అని తెలుసుకోవాలి".
- డా.సమరం, నిపుణులు
ఆరోగ్యానికి ఎలాంటి నష్టం లేదు!
నోట్లో ఉమ్మి ఉత్పత్తి అయినట్లే వృషణాల్లో వీర్యం ఎప్పటికప్పుడు తయారవుతూ ఉంటుంది. ఇది హస్త ప్రయోగం, సెక్స్, స్వప్న స్కలనం ఇలా ఏదో ఒక మార్గంలో బయటకు వెళ్లిపోతుంది. కొన్నిసార్లు మలమూత్ర విసర్జన సమయంలో కూడా వీర్యం బయటకు వెళుతుందని నిపుణులు వివరిస్తున్నారు. మనం నిద్రించేటప్పుడు, మూత్ర విసర్జన సమయంలోనో వీర్యం పోవడం వల్ల మన ఆరోగ్యానికి జరిగే నష్టమేమీ ఉండదని చెబుతున్నారు. రక్తం వీర్యంగా మారుతుంది కాబట్టి వీర్య స్కలనం జరిగితే ఆరోగ్యం దెబ్బతింటోందనేది కూడా అపోహ మాత్రమే అని వైద్యులు చెబుతున్నారు.
స్వప్న స్కలనం ద్వారా!
"హస్త ప్రయోగం అలవాటు ఉన్నవాళ్లకు ఆ పద్ధతి ద్వారా, పెళ్లైన వారు శృంగారంలో పాల్గొన్నప్పుడు వీర్య స్కలనం జరుగుతుంటుంది. పెళ్లి కానివారు, హస్తప్రయోగం అలవాటు లేని వారికి మూత్రం ద్వారా లేదా నిద్రపోతున్న సమయంలో స్వప్న స్కలనం ద్వారా వీర్యం బయటకు వెళుతుంది. ఇది ఒక సహజ ప్రక్రియ" అని అంటున్నారు నిపుణులు.
వీర్యం ఉత్పత్తి 24 గంటలపాటు నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది. ఇది వృషణాల్లో నిల్వ ఉంటుంది. ఇలా వృషణాల్లో నిల్వ ఉన్న వీర్యం ఎక్కువైపోతే ఆటోమెటిక్‌గా బయటకు వచ్చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. "ఇది అత్యంత సాధారణమైన విషయం. యుక్త వయసులో ఉండే పురుషుల్లో అత్యంత సహజంగా సంభవిస్తుంది. ఇది సాధారణ ప్రక్రియే. చింతించాల్సిన అవసరం లేదు" అని వైద్యులు తేల్చారు.
బయటికి చెప్పుకోలేరు - భరించలేరు - ఫ్యూచర్లో చాలా ప్రమాదకరం!
గుడ్డు పచ్చసొన తింటే నిజంగానే ఆరోగ్యానికి ముప్పు? - రీసెర్చ్‌లో ఆసక్తిర విషయం!