ETV Bharat / sukhibhava

థైరాయిడ్​కు, బరువు పెరగడానికి సంబంధమేంటి?

థైరాయిడ్​ సమస్య ఈ మధ్య కాలంలో చాలా మందిని వేధిస్తోంది. అధిక బరువు వంటి సమస్యలతో డాక్టర్​ దగ్గరికి వెళితే థైరాయిడ్​ లోపం అంటున్నారు. అసలు.. థైరాయిడ్​కు అధిక బరువుకు (thyroid weight) సంబంధం ఏంటి? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..

Thyroid Symptoms
థైరాయిడ్ సమస్యలు
author img

By

Published : Oct 12, 2021, 4:39 PM IST

ఈ మధ్యకాలంలో చాలామందిలో థైరాయిడ్​ సమస్యలు కనిపిస్తున్నాయి. థైరాయిడ్​ గ్రంథి పనితీరులో లోపాల వల్ల కలుగుతున్న సమస్యల (Thyroid Symptoms) కోసం ఆసుపత్రికి వెళ్తే.. అసలు విషయం బయటపడుతున్న సందర్భాలు అనేకం. మెడ భాగంలో ముందువైపు సీతాకోక చిలుక ఆకారంలో ఉండే ఈ గ్రంథి థైరాయిడ్​ హార్మోన్లను స్రవిస్తుంది. ఈ హార్మోన్​ శరీరంలోని ప్రతి కణంపైనా తన ప్రభావాన్ని చూపి ఎన్నో పనులు సవ్యంగా జరిగేలా చేస్తుంది. థైరాయిడ్​ హార్మోన్​ ఉత్పత్తి ఎక్కువ, తక్కువ కాకుండా తగినంత ఉండాలి. అలా జరగనప్పుడు దాని పనితీరులో లోపాల వల్ల అనేక సమస్యలు (Thyroid Problems) చుట్టుముడతాయి. అందులో బరువు పెరుగుదల ఒకటి.

అవసరమైన దాని కంటే.. థైరాయిడ్​ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నప్పుడు అలాంటి పరిస్థితిని హైపర్​ థైరాయిడిజమని (Hyperthyroidism), సాధారణ స్థాయి కంటే తక్కువగా థైరాయిడ్​ హార్మోన్​ ఉన్నప్పుడు హైపో థైరాయిడిజమని (Hypothyroidism) అంటారు. థైరాయిడ్ హార్మోన్ శరీరంలో ప్రతి అవయవానికి ఎంతో ఉపయోగపడుతుంది. దీంతో జీవక్రియలు సవ్యంగా సాగుతాయి. హైపో థైరాయిడిజం వల్ల హార్మోన్ లోపించి జీవక్రియలు దెబ్బతింటాయి. ఆ కారణంగా శరీర బరువు (thyroid weight gain) పెరుగుతుంది. థైరాయిడ్​ ట్యాబ్లెట్స్​ను వాడటం ద్వారా ఈ సమస్యను జయించవచ్చు. హైపో థైరాయిడ్​ సమస్య లేకుండా బరువు పెరిగితే.. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. తినే ఆహారం, సరిగా నిద్రపోకపోవటం వంటి జీవనశైలి కారణాలుండవచ్చు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: కొవిడ్​ వేళ థైరాయిడ్​ సమస్యను అధిగమించటం ఎలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.