ETV Bharat / sukhibhava

తిన్న తర్వాత కూల్​డ్రింక్స్, సోడా తాగుతున్నారా? - అయితే మీరు ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే! - Harmful Effects of Soft Drinks in Telugu

Cool Drinks Side Effects on Health : మీకు బిర్యానీ తింటూ కూల్​డ్రింక్స్ తాగే అలవాటు ఉందా? పోని తిన్న తర్వాత సోడా, కూల్​డ్రింక్స్ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు మీరు కచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే మీరు కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Cool Drinks
Cool Drinks
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 18, 2023, 4:05 PM IST

Side Effects of Drinking Soft Drinks after Eating : ఇటీవల కాలంలో కూల్​డ్రింక్స్ వాడకం విపరీతంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. సీజన్​తో సంబంధం లేకుండా కొందరు వీటిని తెగ తాగేస్తుంటారు. అయితే చాలా మంది ఏదైనా హెవీగా భోజనం చేసినప్పుడు కూల్​డ్రింక్స్(Cool Drinks), సోడా తాగడం చేస్తుంటారు. మరికొందరు తిన్న తర్వాత పొట్టలో ఏదైనా ఇబ్బందిగా అనిపించినప్పుడు నిమ్మకాయ సోడాలో ఉప్పు కలిపి తాగుతారు. నేటి యువత అయితే పిజ్జా, బర్గర్, ఏదైనా స్పైసీ ఫుడ్.. తిన్నప్పుడు కూల్​డ్రింక్స్ తప్పనిసరిగా సేవిస్తుంటారు.

Harmful Effects of Soft Drinks : ఇలా భోజనం తర్వాత కూల్​డ్రింక్స్, సోడా లాంటివి తాగడం వల్ల చాలా మంది కడుపులో కాస్తా రిలాక్స్​గా ఉంటుందని, త్వరగా ఆహారం జీర్ణమవుతుందని ఫీల్ అవుతుంటారు. కానీ, తర్వాత కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే తిన్నాక జ్యూస్​లు తాగడం కూడా అంత మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.

సోడా తాగితే.. మీరు భోజనం చేశాక సోడా తాగితే ఎక్కువగా తినాలనే కోరికలు తగ్గుతాయి. అలాగే త్రేన్పులు రావడం ద్వారా వెంటనే కడుపులో పేరుకుపోయిన గ్యాస్ పోయినట్టుగా అనిపిస్తుంది. కానీ, ఇది తాత్కాలికం మాత్రమే అనే విషయం మీరు గమనించాలి. నిజానికి తిన్నాక సోడా తాగడం వలన గ్యాస్ పెరుగుతుందని.. దీంతో అనేక సమస్యలొస్తాయని నిపుణులు చెబుతున్నారు.

గ్యాస్ పెరిగితే.. ఇక కడుపులో గ్యాస్ పెరిగితే పొట్ట నొప్పి వస్తుంది. దాంతో ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా అనిపిస్తుంది. అప్పుడు కూర్చోడానికి, నిల్చోడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే కొంతమందికి గుండెల్లో మంట, మలబద్ధకం, త్రేన్పులు, వెన్నునొప్పి వీటితో పాటు ఛాతీ నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది.

జ్యూస్​లు తాగుతున్నారా.. అదే విధంగా ఇక కొంతమంది తిన్న తర్వాత జ్యూస్​లు కూడా తాగుతారు. ఇలా తాగడం కూడా అస్సలు మంచిది కాదని నిపుణులు అంటున్నారు. దీని వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే బరువు కూడా పెరుగుతారు. కాబట్టి భోజనం తర్వాత వీటిని కూడా తాగకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు.

ఆ సమయంలో ఏం తాగితే బెటర్​.. భోజనం తర్వాత వేడి నీరు తాగడం చాలా మంచిదంటున్నారు నిపుణులు. భోజనం మధ్యలో నీరు తాగకుండా.. తిన్న తర్వాత కాసేపటికి గోరువెచ్చని నీరు, జీలకర్ర నీరు తాగడం బెటర్. ఇలా తాగడం వల్ల తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. వీలైతే హెర్బల్ టీలు కూడా తీసుకోవచ్చు.

నోట్ : ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందిస్తున్నాం. ఈ స్టోరీ కేవలం మీ అవగాహన కోసమే అనే విషయం మీరు గమనించాలి.

శీతలపానీయాలు తాగితే ఆయుష్షు మూడినట్టే!

ఈజీగా బరువు తగ్గాలా..? ఈ హెల్దీ​ డ్రింక్స్​ తాగితే సరి!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.