ETV Bharat / sukhibhava

వైరస్​లపై ఆయుధాలను పొదుపుగా వాడాల్సిందే! - యాంటీబయాటిక్స్ అతిగా వాడకం

యుద్ధం అనివార్యం! కానీ మన తూణీరంలో అస్త్రాలు ఖాళీ అయిపోతున్నాయి. అప్పుడు మనమేం చెయ్యాలి?  అమ్ముల పొదిలోని అస్త్రాలను ఎడాపెడా విచ్చలవిడిగా వాడేసి.. శత్రువు ఇంకా బలపడేలా చేస్తామా? లేక వాటిని పొదుపుగా వాడుకుంటూ శత్రువును గురిచూసి మట్టుబెడతామా? తెలివైన వారెవరైనా తనకున్న అస్త్ర సంపదను పొదుపుగానే వాడుకుంటారు. చీకట్లో బాణాల్లా ఎడాపెడా వేసెయ్యకుండా.. శత్రువు గుట్టుమట్లన్నీ గ్రహించి.. వేటిని వదిలితే ఒక్క దెబ్బకు చస్తారో.. సరిగ్గా గురిచూసి వాటినే ప్రయోగిస్తారు. ఇది విజ్ఞతగల విలుకాడి పని! కానీ సూక్ష్మక్రిములపై నిరంతరం సాగిస్తుండే జీవన్మరణ సమరంలో మనమీ తెలివిని ప్రదర్శించటం మానేశాం! మనవద్దనున్న విలువైన అస్త్రాలు యాంటీబయాటిక్స్‌. ఇవి వ్యాధికారక బ్యాక్టీరియాను సంహరించి.. మనల్ని సంరక్షిస్తుంటాయి. ఇంత విలువైన ఈ అస్త్రాలను మనం అయిందానికీ, కానిదానికీ ఎడాపెడా వాడేస్తున్నాం. నిరుపయోగమని తెలిసీ.. వైరస్‌లపైనా వేసేస్తున్నాం. ఈ క్రమంలో శత్రువు మరింత బలపడేలా చేస్తున్నాం. ఇప్పుడు మనకు కొత్త యాంటీబయాటిక్సేం రావటం లేదు. ఉన్న వాటికి శత్రువు అలవాటుపడిపోతోంది. అందుకే ఆచితూచి.. అవసరమైతేనే.. అదీ సరిగ్గా గురిచూసి శత్రువును సంహరించే రకాన్నే వాడటం నేటి అవసరం. ఇది నేటి అవసరమే కాదు.. మన మానవాళి భవిష్యత్తుకే కీలకం.

antibiotics
antibiotics side effects
author img

By

Published : Aug 2, 2021, 1:33 PM IST

సూక్ష్మక్రిములతో మనకు నిత్య సమరం తప్పదు. మనం ఎక్కడన్నా కొంచెం బలహీనపడ్డామంటే చాలు.. అవి విజృంభించి వ్యాధులను తెచ్చిపెడుతుంటాయి. ఒకప్పుడు మన శరీరం వాటితో ఒంటరి పోరాటమే చెయ్యాల్సి వచ్చేది. అందులో మనం గెలిస్తే బతికే వాళ్లం. లేకుంటే ప్రాణాలపై ఆశలు వదులకునేవాళ్లం. అలాంటి పరిస్థితుల్లో అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌ పరిశోధనల్లో.. చాలా యాదృచ్ఛికంగా పుట్టింది పెన్సిలిన్‌. ఇదే మానవాళి చరిత్రను కీలకమలుపు తిప్పిన మొట్టమొదటి యాంటీబయాటిక్‌. బ్యాక్టీరియాను సంహరించి, మన ప్రాణాల్ని కాపాడటంలో వరంలాంటి ఔషధం ఇది. దీనితో మొదలైంది మన యాంటీబయాటిక్స్‌ ప్రస్థానం. ఈ దారిలో ప్రయోగాలు సాగించిన శాస్త్రవేత్తలు రకరకాల యాంటీబయోటిక్స్‌ అందుబాటులోకి తెచ్చారు. ఇవన్నీ రకరకాల బ్యాక్టీరియాను సంహరించే అస్త్రాలే.

ఎలా పని చేస్తాయి?

క్రిములను యాంటీబయాటిక్స్‌ రకరకాల పద్ధతుల్లో చంపుతాయి. కొన్ని- బ్యాక్టీరియా కణాల గోడను ఛిద్రం చేసి, చంపేస్తాయి. మరికొన్ని- బ్యాక్టీరియాలోని కీలకమైన ‘డీఎన్‌ఏ’ మీద పనిచేసి అవి వృద్ధి చెందకుండా నాశనం చేస్తాయి. ఇంకొన్ని- బ్యాక్టీరియాలో కీలక ప్రోటీన్ల ఉత్పత్తిని అడ్డుకోవటం ద్వారా అవింకేమాత్రం బతకలేని పరిస్థితి సృష్టించి చంపేస్తాయి. ఇలా రకరకాలుగా పనిచేసే యాంటీబయోటిక్స్‌... బ్యాక్టీరియా కారణంగా మనకు సంప్రాప్తించే జబ్బులను, ఇన్‌ఫెక్షన్లను తగ్గించి, ప్రాణాలను కాపాడతాయి. ఇక్కడ గుర్తించాల్సిన అంశమేమంటే ఇవి బ్యాక్టీరియా కారణంగా వచ్చే వ్యాధులకే పని చేస్తాయి. కానీ వైరస్‌, ఫంగస్‌ వంటి ఇతరత్రా క్రిముల ద్వారా వచ్చే జబ్బుల్లో ఇవేమీ చెయ్యలేవు!

అన్నీ హానిచేసేవే అనుకోకూడదు...

సూక్ష్మక్రిములు హాని చేసేవే అయినా వాటికీ, మనుషులకూ చిరకాలంగా అవినాభావ సంబంధం ఉంది. మనిషి ఆవిర్భావం కంటే చాలా ముందు నుంచే సూక్ష్మక్రిములు ఇక్కడ ఉన్నాయి. ఒక రకంగా బ్యాక్టీరియా, మనం సహజీవనం చేస్తూ వచ్చామనే చెప్పుకోవాలి. మన శరీరంలో దాదాపు 1 కోటి కోట్ల జీవ కణాలుంటే.. దానికి పదింతలు ఎక్కువగా.. 10 కోటి కోట్ల బ్యాక్టీరియా కూడా మనలోనే ఉంటుంది. ముఖ్యంగా పేగుల్లో, చర్మం మీద, ముక్కులో, నోట్లో, వూపిరితిత్తుల్లో.. ఇలా చాలా శరీరభాగాల్లో స్థిర నివాసం ఉంటాయి. ఇవన్నీ చెడ్డవే కాదు. వీటిలో మనకు సాయం చేసేవీ, హాని కారక క్రిముల నుంచి మనల్ని కాపాడేవీ ఉంటాయి. పేగుల్లోని బ్యాక్టీరియా మనలోని రోగనిరోధక వ్యవస్థ సమర్థంగా ఉండేలా శిక్షణ కూడా ఇస్తుంటుంది. ఈ మంచి బ్యాక్టీరియా లేకపోతే మనం ఆరోగ్యంగా ఉండటం కష్టం. అయితే మనం యాంటీబయాటిక్‌ వేసుకున్నప్పుడు- దాని ప్రభావానికి చెడు బ్యాక్టీరియానే కాదు.. కొంత మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. అందుకే విరేచనాల వంటి రకరకాల దుష్ప్రభావాలు బయల్దేరతాయి. కొన్నిసార్లు మంచి బ్యాక్టీరియా దెబ్బతిని, దాని స్థానంలో కొంత చెడు బ్యాక్టీరియా చేరుతుంది. దాంతో కొత్త సమస్యలు బయల్దేరతాయి. కాబట్టి యాంటీబయాటిక్స్‌తో అంతా మంచే అనుకోవద్దు. రెండోది- ఈ క్రిములన్నీ లక్షలాది సంవత్సరాలుగా రకరకాల ఆటుపోట్లను తట్టుకుని మరీ మనుగడ సాగిస్తున్నాయి. కాబట్టి మనం వేసే మందులను తట్టుకుని కూడా నిలబడటం (నిరోధకత) ఎలాగో వాటికి బాగా తెలుసు. ఇదే పెద్ద సమస్య.

నిరోధకత పెంచుకోవటమంటే ఏమిటి?

ఒకప్పుడు ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ వస్తే పెన్సిలిన్‌ ఇస్తే తగ్గిపోయేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. పెన్సిలిన్‌ తర్వాత.. రకరకాల యాంటీబయాటిక్స్‌, కొత్తతరాలు, అత్యాధునికమైనవి ఎన్నో వచ్చాయి. నేటి అధునాతన ఆసుపత్రుల్లో అత్యాధునికయాంటీబయాటిక్స్‌ వాడినా మృత్యువాతపడుతున్న వారు ఎంతోమంది! ఇలా యాంటీబయాటిక్స్‌ పనిచేయని కారణంగానే అమెరికాలోనూ, ఐరోపాలోనూ ఏడాదికి కనీసం 25,000 మంది చనిపోతున్నారని అంచనా. ఇక మన దక్షిణాసియా దేశాల్లో అయితే కేవలం ఈ నిరోధకత, ప్రస్తుత యాంటీబయాటిక్స్‌ పనిచేయకుండా పోతున్న కారణంగానే ప్రతి 5 నిమిషాలకూ ఒక బిడ్డ చనిపోతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. యాంటీబయాటిక్స్‌ను ఎడాపెడా, విచ్చలవిడిగా, అవసరమున్నా లేకున్నా వాడేస్తుండటం వల్ల ఈ విపత్కరస్థితి దాపురిస్తోంది. ఈ మందుల నుంచి ఎలా తప్పించుకోవాలన్నది నేర్చుకుని.. మామూలు బ్యాక్టీరియా కూడా మొండిగా తయారవుతోంది. తేలికగా తగ్గిపోవాల్సిన క్షయ, టైఫాయిడ్‌ వంటి చాలా వ్యాధులు ఇప్పుడు పలు మందులకు కూడా లొంగని రకాలుగా (మల్టీ డ్రగ్‌ రెసిస్టెంట్‌) ముదిరిపోతున్నాయి. యాంటీబయాటిక్స్‌ను సరైన పద్ధతిలో వాడితే ఈ పరిస్థితి వచ్చేది కాదు.

యాంటీబయాటిక్స్‌ ఎప్పుడు వాడాలి?

లక్షణాలు చూసి.. వ్యాధి చాలా వరకూ బ్యాక్టీరియా వల్లనే వచ్చిందని గుర్తించినప్పుడు యాంటీబయాటిక్స్‌ తప్పకుండా వాడాలి. ఉదాహరణకు గడ్డ కట్టి, చీముపట్టి, ఎర్రగా కనబడుతోంది, అప్పుడది కచ్చితంగా బ్యాక్టీరియా వల్లనే వచ్చిందని తెలుసు. అలాగే విరేచనాలు అవుతూ, అందులో రక్తం, చీము పడుతోంది. కచ్చితంగా అది బ్యాక్టీరియా వల్లనే వచ్చిందని తెలుస్తోంది కాబట్టి యాంటీబయాటిక్స్‌ తప్పకుండా వాడాలి. పరీక్షలు చేసి క్రిమిని గుర్తించినప్పుడు వాడొచ్చు. వాడాల్సిన అవసరం ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్‌ వాడకపోవటం వల్ల ప్రాణనష్టం సంభవిస్తుంది. కాబట్టి విచక్షణతో వాడటం ముఖ్యం. ఉదాహరణకు టాన్సిలైటిస్‌ వస్తే- పెన్సిలిన్‌, అమాక్ససిలిన్‌ బాగా పని చేస్తాయి. న్యుమోనియా వస్తే అమోక్ససిలిన్‌ సమర్థంగా పని చేస్తుంది. ఇలా స్పష్టమైన మార్గదర్శకాలున్నాయి. నేరుగా పనిచేసే ఈ న్యారోస్పెక్ట్రమ్‌ మందులను పట్టించుకోకుండా బ్రహ్మాస్త్రాలు వేస్తామంటూ కొత్తరకం ‘బ్రాడ్‌స్పెక్ట్రమ్‌’ యాంటీబయాటిక్స్‌ ఇవ్వాలనుకోవటం వృథా. తక్కువ ఖర్చులో, సమర్థంగా పని చేసే యాంటీబయాటిక్‌నే వెయ్యాలి. లేకపోతే ఉన్న జబ్బు తగ్గకపోగా దుష్ప్రభావాలు తోడవుతాయి. వైద్యులు కూడా కొద్దిగా సమయం తీసుకుని ఇంట్లో ఇంకెవరికైనా జ్వరం వచ్చిందా? దాని తీరెలా ఉంది? జ్వరం తగ్గినప్పుడు ఎలా ఉంటున్నాడు? వంటివన్నీ కనుక్కుని యాంటీబయాటిక్స్‌ రాయటం అవసరమా? లేదా? అని తేల్చవచ్చు.

అస్త్రాలు అయిపోతున్నాయి!

యాంటీబయాటిక్స్‌ అనేవి వరాలు. వైద్యపరిశోధనా రంగం ఎంతో కష్టపడి ఈ విలువైన అస్త్రాలను ఆవిష్కరించింది. వీటిని వైద్యులు, తల్లిదండ్రులు విచ్చలవిడిగా వాడేస్తే మనకూ, మొత్తం మానవాళికే హాని జరుగుతుంది. ఎందుకంటే 1970-80లలో కనుగొన్న, ఉత్పత్తి అయిన, మార్కెట్లోకి వచ్చినన్ని యాంటీబయాటిక్స్‌ ఇప్పుడు రావటం లేదు. కొత్తగా వచ్చే అస్త్రాలు లేవు... పాతవి పని చేయటం లేదు! అందుకే మనం ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాం. ఇప్పుడైనా మేలుకోకపోతే తిరిగి పాత కాలానికి.. అంటే అప్పటిలా వేలు, లక్షల మంది ఇన్ఫెక్షన్ల పాలబడి మృత్యువాతపడే దుర్భర పరిస్థితులకు వెళ్లిపోతామని గుర్తించాలి!

  • అంతా జబ్బులు వచ్చిన తర్వాత యాంటీబయాటిక్స్‌ వాడే కంటే టీకాలు అందుబాటులో ఉన్న వ్యాధులకు ముందుగానే టీకా వేసుకుంటే ఉత్తమం. ఫ్లూ, న్యుమోనియా, రోటా వైరల్‌ డయేరియా, డిప్థీరియా, కోరింతదగ్గు, టైఫాయిడ్‌, మీజిల్స్‌ వంటి వాటన్నింటికీ ఇప్పుడు టీకాలున్నాయి. వాటిని ముందే ఇవ్వటం మంచిది. చేతి శుభ్రత, నీటి శుభ్రత, ఆహార శుభ్రత, టీకాలు, చక్కటి పోషకాహారం.. ఇవన్నీ ఇన్ఫెక్షన్లు రాకుండా కీలకమైనవి. దీనివల్ల మనం యాంటీబయాటిక్స్‌ తీసుకోవాల్సిన అవసరం బాగా తగ్గుతుంది.

ఎందుకీ దుర్వినియోగం..?

  • సొంత వైద్యాలు: వైద్యుల చీటీ లేకుండా కూడా యాంటీబయాటిక్స్‌ దుకాణాల్లో విరివిగా దొరుకుతున్నాయి. వీటిని ఎప్పుడు, ఎందుకు వాడాలన్న అవగాహన లేకుండా ఎవరికివారు కొనుక్కొని వాడేసుకుంటున్నారు. అవసరం లేకున్నా విచక్షణా రహితంగా వాడటం వల్ల బ్యాక్టీరియా వీటికి అలవాటుపడి మొండిగా తయారవుతోంది. యాంటీబయాటిక్స్‌ వాడేస్తే అన్నీ తగ్గిపోతాయన్న భావన తప్పు.
  • జంతువుల నుంచి: జంతువుల చికిత్సలోనూ యాంటీబయాటిక్స్‌ విపరీతంగా వాడుతున్నారు. దీనివల్ల వాతావరణంలో ఆ మందులను తట్టుకొనే సామర్థ్యం గల బ్యాక్టీరియా పుట్టుకొచ్చిస్తోంది. అది మనలో వ్యాధులను కలిగించటం, మందులకు లొంగకపోవటం, పైగా మన నుంచి ఇతరులకూ వ్యాపించటం.. ఇదో విషవలయంలా తయారైంది.

గురిలేని యుద్ధం:

antibiotic tablets
వైరస్​.. బ్యాక్టీరియ లక్షణాలు

యాంటీబయోటిక్స్‌లో రకరకాలున్నాయి. కొన్ని రకాల యాంటీబయాటిక్స్‌ కొన్నిరకాల బ్యాక్టీరియా క్రిములను సంహరిస్తాయి. కాబట్టి మనకు వ్యాధి ఏ రకం బ్యాక్టీరియా వల్ల వచ్చిందన్నది గుర్తించి.. దాన్ని సంహరించే యాంటీబయాటిక్‌ వాడితే సమర్థంగా తగ్గిపోతుంది. ఇలా దేనివల్ల వచ్చిందో కచ్చితంగా దాన్నే సంహరించే మందును ‘న్యారో స్పెక్ట్రమ్‌’ యాంటీబయాటిక్‌ అంటారు. ఇలా కాకుండా కొన్ని ఎక్కువ రకాల బ్యాక్టీరియాలనూ చంపేవి ఉంటాయి. వీటిని ‘బ్రాడ్‌/వైడ్‌ స్పెక్ట్రమ్‌’ యాంటీబయాటిక్స్‌ అంటారు. అసరమున్నా లేకున్నా ఎక్కువ రకాల క్రిములను చంపే ‘వైడ్‌ స్పెక్ట్రమ్‌’ యాంటీబయోటిక్స్‌ను వాడెయ్యటం పెరుగుతోంది. ఇన్‌ఫెక్షన్‌కు సరైన కారణాన్ని గుర్తించకుండా ఏదో ఒక మందుతో తగ్గకపోతుందా? అనే ధోరణితో చీకట్లో బాణం వేసినట్టుగా ఇలాంటి మందులను ఇవ్వటం వల్ల ఇన్‌ఫెక్షన్‌ తగ్గుతుండొచ్చు కానీ వాటిలో మందులకు నిరోధక పెరుగుతుందని గుర్తించాలి. వీలైనంత వరకూ ఇన్ఫెక్షన్‌ దేనివల్ల వచ్చిందో గుర్తించి.. కచ్చితంగా దాని మీదే పని చేసే ‘న్యారో స్పెక్ట్రమ్‌’ యాంటీబయాటిక్సే ఇస్తే మంచిది.

ముందు జాగ్రత్త పేరుతో:

అప్పుడే పుట్టిన పసిబిడ్డల వంటివారికి ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్లు రాకుండా ముందు జాగ్రత్త పేరిట శక్తిమంతమైన యాంటీబయాటిక్స్‌ ఇస్తున్నారు. దీనివల్ల నిరోధకత మరింతగా పెరుగుతోంది. తర్వాత ఈ పిల్లలకు మరేదైనా సమస్య వచ్చినప్పుడు సాధారణ యాంటీబయాటిక్స్‌ పనిచేసే పరిస్థితి ఉండటం లేదు. ఏవైనా వ్యాధి లక్షణాలు కనబడినప్పుడు, వాటిని నిర్ధరించుకున్నాకే యాంటీబయాటిక్స్‌ ఇవ్వటం సరైన పద్ధతి. ఇలా అనవసరంగా అమికాసిన్‌ వంటి మందులు ఇచ్చినప్పుడు పిల్లలకు శాశ్వతంగా వినికిడి దెబ్బతినటం, కిడ్నీలు పాడవటం వంటి తీవ్ర దుష్ప్రభావాలూ ఉంటాయని మర్చిపోకూడదు.

సరైన మోతాదులో ఇవ్వకపోవటం:

యాంటీబయాటిక్స్‌ వాడటం మొదలుపెడితే పూర్తి మోతాదులో ఇవ్వాలి. లేకపోతే నిరోధకత పెరుగుతుంది. నాసిరకం, నకిలీ మందుల వల్ల కూడా నిరోధకత పెరుగుతోంది.

మధ్యలో మానటం: వైద్యులు రాసిన యాంటీబయాటిక్‌ మొదలుపెట్టినప్పుడు మధ్యలో విరేచనాల వంటివి అవుతుంటే వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలేగానీ మందు మానకూడదు. కానీ చాలామంది 'అరె మందు వేయగానే ఇలా అయ్యిందేంటని' రెండుసార్లు ఇవ్వాల్సిన మందును తగ్గించి ఒకసారే ఇవ్వటం, లేదంటే చెంచా పట్టాల్సింది అరచెంచా చెయ్యటం, రెండుమూడు రోజులు వేసి మానెయ్యటం వంటివి చేస్తారు. సాధారణంగా పిల్లలకు వాడే యాంటీబయోటిక్‌ సిరప్‌లు 40 ఎం.ఎల్‌, 50 ఎం.ఎల్‌. ఉంటాయి. చాలామంది ఒక సీసా కొంటారు. అది అయిపోయాక మరోటి కొనరు. దీంతో కోర్సు పూర్తికాదు. అన్ని సీసాలు వాడాలా? ఒక సీసా సరిపోతుందిలే.. మందు మరీ ఎక్కువైపోతుందేమో.. ఇలా అనుకుంటూ.. పూర్తి కోర్సు వాడకుండా సగంలో ఆపినా, తక్కువ మోతాదులో వాడినా ఆ క్రిములు మొండిగా తయారవుతాయి. చాలా ఇన్ఫెక్షన్లకు 7 రోజులు యాంటీబయాటిక్స్‌ వాడాల్సి ఉంటుంది. వైద్యులు చెప్పినట్లు పూర్తి కోర్సు వాడటం ముఖ్యం. కొంచెం జబ్బు తగ్గగానే మానేయటం మరో సమస్య. అదీ సరికాదు.

అవసరం లేకున్నా వాడటం: నీళ్ల విరేచనాల వంటి సమస్యలకు అసలు యాంటీబయాటిక్స్‌ అవసరమే లేదు. విరేచనాలకు ఏదో ఒకటి వెయ్యాలి కదా అని యాంటీబయాటిక్స్‌ దుర్వినియోగం చేసేస్తుంటే దానివల్ల లాభం లేకపోగా నష్టమే ఎక్కువ. అలాగే యాంటీబయాటిక్స్‌ అనేవి జ్వరం తగ్గించే మందులు (యాంటీపైరెటిక్స్‌) కాదు. జలుబు, దగ్గు, జ్వరం, ముక్కుకారటం.. ఇలాంటివన్నీ చాలా వరకూ అలర్జీతోగానీ, వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌తో గానీ వస్తాయి. వీటికి యాంటీబయాటిక్స్‌ ఇస్తే వైరస్‌ చావదు. సాధారణ జలుబు, దగ్గులు మందు వేసినా వెయ్యకున్నా 7-10 రోజులకు అవే తగ్గిపోతాయి. వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌తో పాటుగా సైనస్‌ ఇన్‌ఫెక్షన్‌ వంటి ఇతరత్రా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌ కూడా వచ్చినట్టు నిర్ధరణ అయితేనే యాంటీబయోటిక్స్‌ ఇవ్వాలి.

వైద్యులపై ఒత్తిళ్లు తేవటం: చాలాసార్లు నిన్న యాంటీబయాటిక్‌ మొదలుపెట్టాం, జబ్బు ఇంకా తగ్గలేదు, మందు మార్చండని వైద్యులపై ఒత్తిడి తెస్తుంటారు. ఇది సరికాదు. మొదలుపెట్టిన యాంటీబయాటిక్స్‌ పనిచేసి ఇన్ఫెక్షన్‌ నియంత్రణలోకి రావటానికి కనీసం 72 గంటలు, కొన్నిసార్లు నాలుగు రోజులు కూడా పట్టచ్చు. చికిత్స మొదలుపెట్టిన తర్వాత మార్పు కనబడటానికి 3-4 రోజులు పడుతుంది. క్షయ వంటివాటికైతే మూడు, నాలుగు వారాల వరకూ ఏమీ గుణం కనిపించకపోవచ్చు. కానీ పూర్తిగా వాడటం ముఖ్యం.

పరీక్షలను తప్పించటానికి: జబ్బు చేసినప్పుడు పరీక్షలు చెయ్యటం, ఏ ఇన్ఫెక్షన్‌ ఉందో నిర్ధారించుకోవటం.. అవన్నీ ఎందుకనుకుంటూ పరీక్షలు చెయ్యకుండా ఉండటానికి బ్రాడ్‌/వైడ్‌ స్పెక్ట్రమ్‌ యాంటీబయాటిక్స్‌ వాడే ధోరణి మంచిది కాదు. అవసరమైతే పరీక్షలు చేసి, నేరుగా పనిచేసే యాంటీబయాటిక్‌ ఇవ్వాలి.

ఇదీ చదవండి:వయసు తక్కువ అనుకుంటే.. మీకు ఎన్నో లాభాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.