ETV Bharat / sukhibhava

పుట్టుమచ్చలను శాశ్వతంగా తొలగించొచ్చా? - పుట్టు మచ్చలు తొలగించొచ్చా?

పుట్టు మచ్చలు కొందరికి ముఖం మీద అందవిహీనంగా ఉంటాయి. వాటిని శాశ్వతంగా తొలగించొచ్చా? తొలగిస్తే ఏమైనా అవుతుందా? అని చాలామంది అడుగుతుంటారు. అయితే అది సాధ్యమే అంటున్నారు నిపుణులు.

amole
పుట్టుమచ్చ
author img

By

Published : Nov 28, 2021, 8:50 AM IST

దూరంగా నున్నగా.. కోమలంగా కనిపించేవారి ముఖంపై కొన్ని పెద్ద పుట్టుమచ్చలు ఉంటాయి. అవి ఎబ్బెట్టుగా కనిపిస్తుంటాయని చాలామంది బాధపడుతుంటారు. ఇవి నొప్పి పుట్టించనప్పటికీ.. కళకళలాడాల్సిన ముఖం కళావిహీనంగా కనిపిస్తుందని వాటి గురించే ఆలోచిస్తుంటారు. మనలోని ఆత్మస్థైర్యాన్ని అంతో ఇంతో దెబ్బతీయగల వీటిని.. శాశ్వతంగా తొలగించుకోవడానికి ఏం చేయాలి?

తీసేయొచ్చు.. కానీ..

ముఖంపై పెద్ద పెద్ద పుట్టుమచ్చలు రావడం సహజం. ఆపరేషన్ ద్వారా వీటిని తొలగించొచ్చని వైద్యులు చెబుతున్నారు. సైజును బట్టి పెద్దవయినా, చిన్నవైనా తీసేయొచ్చంటున్నారు. వీటిని తొలగించినప్పటికీ ఇబ్బందేమీ ఉండదంటున్నారు. లేజర్, రేడియో ఫ్రీక్వెన్సీ, పంచ్ క్రాఫ్టింగ్ టెక్నాలజీ ద్వారా చేసే ఈ ప్రక్రియలో చర్మం సహజంగా ఉన్నట్లు కనపడేలా చేస్తామని వివరించారు.

ఇలా చేయించుకోవడం వల్ల భవిష్యత్​లోనూ ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవని.. నిజానికి ఇలా తొలగించుకోవడం వల్ల పుట్టుమచ్చల నుంచి క్యాన్సర్ తలెత్తే అవకాశాలను రూపుమాపే అవకాశం ఉందని చర్మ వైద్యుల నిపుణులు తెలిపారు.

అయితే ధ్రువీకరణ పత్రాల్లో అంటే.. పాస్​పోర్ట్, స్టడీ సర్టిఫికేట్లలో గుర్తింపు కోసం ఇచ్చిన పుట్టుమచ్చలను మాత్రం తొలగించుకోకపోవడమే ఉత్తమమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల న్యాయపరమైన సమస్యలు(మెడికో-లీగల్ ప్లాబ్లం) తలెత్తే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.