ETV Bharat / sukhibhava

మీకు ఆ అలవాట్లు ఉన్నాయా?.. అయితే జాగ్రత్త! - sukhibhava

మీరు నిద్రకు సరైన సమయం కేటాయించడం లేదా? అధిక జంతు మాంసం ఉండే ఆహారం తింటున్నారా? నిత్యం కూర్చునే ఉంటున్నారా? అయితే మీరు జాగ్రత్త పడాల్సిందే. చిన్నచిన్న అలవాట్లు.. జీవితాన్ని నాశనం చేసే అవకాశముంది.

habits
అలవాట్లు
author img

By

Published : Aug 14, 2021, 9:05 AM IST

Updated : Aug 14, 2021, 11:09 AM IST

కొన్ని కొన్ని అలవాట్లు మనిషి జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి. వారు అత్యున్నత స్థాయికి చేరుకునేందుకు ఉపకరిస్తాయి. కానీ కొన్ని అలవాట్లు.. అదే మనిషి జీవితాన్ని నాశనం చేస్తాయి. కొవిడ్​ వేళ ఇవి బాగా ఎక్కువ అయ్యాయి. చిన్నవే కదా అనుకుని మనం నిర్లక్ష్యం చేసే ఎన్నో అలవాట్లు.. ఆరోగ్య, రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీస్తాయి. వాటిల్లో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

నిద్ర:- శరీరానికి సరైన నిద్ర ఎంతో అవసరం. కానీ చాలా మంది సరిగ్గా నిద్రపోవడం లేదు. దీని ప్రభావం ఆ తర్వాతి రోజు మీద పడుతుంది. రోజంతా చిరాకుగా ఉంటుంది. రోజుకు కనీసం 6 గంటల నిద్ర అవసరం అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నిద్ర విషయంలో రాజీపడితే రోగనిరోధక శక్తి, శ్వాస, జీర్ణ వ్యవస్థ దెబ్బతింటాయి.

జంతు మాంసం-ప్రోటీన్​:- జున్ను, మాంసం వంటి జంతువుల నుంచి వచ్చిన ప్రోటీన్లు కేన్సర్​కు దారితీస్తాయి. వాటిల్లో ఉండే ఐజీఎఫ్​1 హార్మోన్లే ఇందుకు కారణం. ఇది ధూమపానం వల్ల కలిగే అనర్థాలతో సమానం. అందువల్ల వీటిని దూరం పెట్టి.. చెట్ల నుంచి వచ్చే ప్రోటీన్లు అయిన బీన్స్ వంటి పదార్థాలను​ ఆహారంలో తీసుకోవాలి.

కూర్చునే ఉండటం:- ఆఫీస్​లో, ఇంట్లో గంటల తరపడి కూర్చునే ఉండటం ఆరోగ్యానికి అత్యంత హానికరం. దీని వల్ల ఊపిరితిత్తులు, రొమ్ము కేన్సర్​ వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనీసం 1-2 గంటల పాటు నడక ఉండాలని సూచిస్తున్నారు.

ఒంటరితనం:- ఒంటరితనాన్ని చాలా మంది అసలు సమస్యగానే పరిగణించరు. కానీ ఇది కూడా పెద్ద సమస్యే. ఒంటరితనంతో బాధపడే వారికి గుండె సమస్యలు వస్తాయి. ఒత్తిడి, ఆందోళన పెరుగుతుంది. అందువల్ల స్నేహితులతో కలిసి ఉండటం అలవాటు చేసుకోవాలి.

టానింగ్​(చర్మ శుద్ధి):- టానింగ్​ సెంటర్లకు వెళ్లే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇది కూడా ప్రమాదమే. ఎండలో కొంత సమయం గడిపితే సరిపోతుంది. అందుకు తగినంత సమయం కేటాయించాలి.

-నేహా మిత్తల్, వన్​ఎబోవ్​ సహ-వ్యవస్థాపకులు.

Last Updated : Aug 14, 2021, 11:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.