రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ నర్సయ్యను సస్పెండ్(Yadagirigutta Rural CI Narsaiah suspended) చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదారిగిగుట్ట రూరల్ సీఐ నర్సయ్య(Yadagirigutta Rural CI Narsaiah)పై ఓ ఫిర్యాదు అందింది. భూ వివాదంలో జోక్యం చేసుకున్నారనేది ఆ ఫిర్యాదు సారాంశం. తమ ప్రత్యర్థులతో కలిసి తమకు అన్యాయం చేస్తున్నారని బాధితులు కంప్లైట్ ఇచ్చారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలోనే సీఐ నర్సయ్యపై సస్పెన్షన్ వేటు(Yadagirigutta Rural CI Narsaiah suspended) విధించారు.
- గతంలోనూ కొందరిపై వేటు...
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ట్రాఫిక్ సీఐ కృష్ణపై ఉన్నతాధికారులు గతంలో వేటు వేశారు. మద్యం మత్తులో కారుతో ఓ వ్యక్తిని ఢీకొట్టినందుకుగానూ క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సీఐని సస్పెండ్ చేస్తూ వెస్ట్‌జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో సీఐగా విధులు నిర్వహిస్తోన్న కృష్ణ... రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పరిధిలో మద్యం మత్తులో ఓ వ్యక్తిని ఢీకొట్టాడు. ప్రమాదానికి గురైన వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో సీఐ కృష్ణపై ఐజీ స్టీఫెన్ రవీంద్ర క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. విధుల్లోంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
- రిసార్టులో మహిళతో...
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై అనిల్ సస్పెన్షన్‌కు గురయ్యారు. కీసరలోని సైలెంట్ రిసార్ట్‌లో ఓ మహిళతో సన్నిహితంగా ఉండగా... పోలీసులు దాడి చేశారు. మహిళతో పాటు అదుపులోకి తీసుకున్నారు.
విచారణ చేసిన అధికారులు ఎస్సై అనిల్‌పై క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అనిల్‌ను సస్పెండ్ చేశారు.
సమాజాన్నే చక్కదిద్దాల్సిన కొందరు పోలీసులు ఇలా వ్యవహరించి నిబద్ధత కలిసిన ఆ శాఖకే మచ్చతెస్తున్నారు. తప్పు చేస్తే సరిదిద్దాల్సిన చేతులతోనే తప్పుడు వ్యవహారాల్లో మునిగితేలుతున్నారు.
ఇదీ చూడండి: Tragedy : ఒకే వీధిలో ముగ్గురు యువతులు అదృశ్యం.. చెరువులో మృతదేహాలు