మాడవీధిలో హరితం చూస్తుంటే మళ్లీ చూడాలనిపించేలా.. ఒక్కసారి వస్తే ఆ సన్నిధికి మళ్లీ మళ్లీ రావాలనిపించేలా యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి క్షేత్రం మహా దివ్యంగా సకలభక్తజనులను కనులవిందుగొల్పనుంది. పంచనారసింహులతో స్వయంభువి క్షేత్రాభివృద్ధిలో ఆలయాన్ని విస్తరించి, కృష్ణశిలతో పునర్నిర్మించారు. మరెక్కడా లేని తరహాలో రూపొందించే దృఢ సంకల్పంతో ఆలయ సన్నిధితీర్చిదిద్దే పనుల సంపూర్తికి 'యాడా' యత్నిస్తోంది.
పిలిచిన పలికే దేవుడు..
నమ్మిన భక్తులన్నంటి ఉండే ఆప్తుడిగా కొలిచే శ్రీ లక్ష్మీ సమేతుడైన నారసింహ స్వామి దర్శించేందుకు బాధ తీరే భక్తజనులలో భక్తితత్వాన్ని కలిగించేలా క్యూ కాంప్లెక్స్ సిద్ధమవుతోంది. కాంప్లెక్స్ నుంచి ఆలయమాడవీధికి చేరిన ఆ భక్తుల కోసం ప్రత్యేక లోహంతో బంగారు వర్ణంతో దర్శన వరుసల ఏర్పాట్లను చేపట్టారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నుంచి తీసుకువచ్చిన అల్యూమినియం ఇత్తడి క్యూ లైన్ వరుసలను ఆధ్యాత్మికంగా కనిపించే రూపాలను తీర్చిదిద్దుతున్నారు. వాటిపై శంకు చక్ర నామాలు , విష్ణుమూర్తి దేవతామూర్తుల విగ్రహాల రూపాలు కనిపించేలా ఫ్రేమ్లను రూపొందించారు..ఇష్టదేవుడిని చూశాక, మానసికోల్లాసం పొందేలా భక్తులు సేద తీరేందుకు ఆలయ మాడవీధిలో ఉత్తర దిశలో హరితమయంగా పచ్చదనం పోషిస్తున్నారు. హరిత ప్రాంగణం నుంచి హరి (నారసింహ క్షేత్ర సందర్శన మహా దివ్య స్వరూపంగా దర్శనమివ్వనుంది.
ఇదీ చూడండి: పండుగ కోసమని వచ్చారు.. వస్తు వస్తూ కరోనా తెచ్చారు