యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సుందరంగా తీర్చిదిద్దే క్రమంలో స్వర్ణ మయంగా దర్శన వరుసల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రత్యేక మెటీరియల్‌తో మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌లో సిద్ధమైన వరుసలను మందిరం మాదిరిగా నిర్మిస్తున్నారు. పంచనారసింహుల ఆలయ మాఢ వీధిలో ఏర్పాటవుతున్న ఈ నిర్మాణంతో నారసింహుని సన్నిధి మరింత శోభాయమానంగా మారనుంది. ఈపనులు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌సాయి పర్యవేక్షణలో జరుగుతున్నాయి.
కృష్ణశిలను మరిపించేలా రక్షణ గోడ
యాదాద్రి క్షేత్రంలో సహజత్వం ఉట్టిపడేలా ఆలయ నలుమూలలా రక్షణ గోడ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పడమర వైపు గోడను నీలిరంగు (గ్రీన్ జా టెక్చర్ పెయింటింగ్)తో తీర్చిదిద్దుతున్నారు. యాదాద్రీశుడి కొండకు దక్షిణ, పడమర దిశల్లో సుమారు రూ.170 కోట్ల వ్యయంతో రక్షణ గోడ నిర్మించిన విషయం తెలిసిందే. సంపూర్ణంగా కృష్ణశిలతో పునర్నిర్మితమైన సంబోద్భవుడి సన్నిధిని పోలి ఉండేలా రక్షణ గోడను దిల్లీకి చెందిన నిపుణుల సహకారంతో హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ పెయింటింగ్ పనులు చేపడుతున్నట్లు ఆర్అండ్బీ శాఖ ఈఈ వెంకటేశ్వర రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి: YADADRI TEMPLE: అష్టదిక్పాలకులను పొందుపరించేందుకు యాడా సన్నద్ధం