యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా అనుబంధ ఆలయాల నిర్మాణం తుది దశకు చేరుకున్నాయి. కొండపై నిర్మిస్తున్న శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
శైవాగమ ఆచారాలతో తయారుచేయించిన ప్రత్యేక ద్వారాలు కొండపైకి చేరాయి. శివాలయం తూర్పు, పడమర, ఉత్తర దిక్కుల్లో వాటిని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ప్రహరీతో పాటు శివపార్వతుల కల్యాణ మండపం పూర్తయింది. శివాలయంలో ఉప ఆలయాలైన రాహు, కేతు, శ్రీరామ, సుబ్రహ్మణ్య ఆలయాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: కర్రతో వినూత్న ఆవిష్కరణలు... ఆకట్టుకుంటున్న సోదరులు