ETV Bharat / state

YADADRI: తిరుమల తరహాలో యాదాద్రిలో రాగి హుండీలు

యాదాద్రి పుణ్యక్షేత్రంలో తిరుమల వలె రాగి పాత్ర శ్వేత వస్త్రంతో కూడిన హుండీలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పంచనారసింహుల ఆలయ రథశాల నిర్మాణం కూడా పూర్తైనట్లు ఆలయ ఈవో గీతా తెలిపారు.

YADADRI
యాదాద్రి
author img

By

Published : Aug 30, 2021, 12:27 PM IST

రాష్ట్రానికి వన్నె చేకూర్చేలా రూపొందుతున్న యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో.. అధికారులు తిరుమల దేవస్థానం తరహాలో హుండీలను ఏర్పాటు చేస్తున్నారు. పూర్తిగా కృష్ణశిలతో పునర్నిర్మితమైన ప్రధాన ఆలయంలో ఆరుచోట్ల.. రాగి పాత్ర శ్వేత వస్త్రంతో కూడిన హుండీలను ఏర్పాటు చేయనున్నట్లు ఆలయ ఈవో గీతా తెలిపారు. సదరు హుండీలను తిరుపతిలోని శ్రీ వెలన్ క్రియేషన్ ఆధ్వర్యంలో తయారు చేయిస్తున్నట్లు వెల్లడించారు.

మహాదివ్య పుణ్యక్షేత్రంగా రూపొందుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఏర్పాటయ్యే ప్రత్యేక హుండీల కోసం హైదరాబాద్​కు చెందిన దాత రూ.5 లక్షల విరాళం ప్రకటించారు. అఖిల భారత పద్మశాలి సంఘం వైస్ ప్రెసిడెంట్ కె. గోపాల్ రూ.5 లక్షల చెక్కును ఆలయ ఈవో గీతకు అందజేశారు.

రథశాల నిర్మాణం పూర్తి

యాదాద్రి పుణ్యక్షేత్రంలో పంచనారసింహుల ఆలయ రథశాల నిర్మాణం పనులు పూర్తయ్యాయి. ఆలయ ఉత్తర దిశలో ఫైబర్ మెటీరియల్​తో చేపట్టిన రథశాలను.. వైష్ణవ తత్వం ప్రస్ఫుటించేలా రూపొందించారు. 10 మీటర్ల ఎత్తు, 6మీటర్ల వెడల్పుతో తయారైన రథశాలకు మూడు వైపులా వైష్ణవ చిహ్నాలను పొందుపరిచారు. ఉత్తర, దక్షిణ దిశల్లో రథశాల రూపాలు, పడమటి వైపు గరుడ, ఆంజనేయ స్వామి విగ్రహ రూపాలతోపాటు శంఖం, తిరునామాలు, శ్రీ చక్రం చిహ్నాలను తీర్చిదిద్దారు. ముందు భాగంలో షెటర్ ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి: 'వాల్టా చట్టాన్ని పునఃసమీక్షించాలి.. 'పోడు' కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.