ETV Bharat / state

Yadadri: యాదాద్రిలో అధునాతన హంగులతో ప్రెసిడెన్షియల్ సూట్స్ - తెలంగాణ వార్తలు

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పునర్నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ కోవెలను తీర్చిదిద్దుతున్నారు. నారసింహుని దర్శించుకునేందుకు వచ్చే అతిథుల కోసం అధునాతన హంగులతో వీఐపీ వసతి గృహాలను నిర్మిస్తున్నారు. ఆహ్లాదకర వాతావరణం కోసం వాటిచుట్టూ చెట్లు, పూల మొక్కలను పెంచుతున్నారు. అతిథి గృహాల పనులు ఈనెలాఖరుకల్లా పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు.

Yadadri temple reconstruction works, yadadri vvip suits constructions
యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణం, వీవీఐపీ అతిథి గృహాలు
author img

By

Published : Jul 17, 2021, 7:57 PM IST

యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే అత్యాధునిక హంగులతో అతిథుల కోసం వసతి గృహాలను నిర్మిస్తున్నారు. ఈ పనులు తుది దశకు చేరుకున్నాయి. మిగతా పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు యాడా కృషి చేస్తోంది.

Yadadri temple reconstruction works, yadadri vvip suits constructions
ఆధునిక హంగులతో విల్లాల నిర్మాణం

ఆధునిక హంగులతో..

యాదాద్రి పుణ్యక్షేత్రానికి వచ్చే వీవీఐపీల బస కోసం 13 ఎకరాల విస్తీర్ణంలో ప్రధానాలయానికి ఉత్తరం దిశలోని మరో కొండపై నిర్మిస్తున్నారు. సుమారు రూ.104 కోట్లతో చేపట్టిన 15 విల్లాల పనులు తుది దశకు చేరుకున్నాయి. అత్యాధునికంగా నిర్మిస్తున్న ప్రెసిడెన్షియల్ సూట్ విల్లా ఎదుట ఫ్లోరింగ్, గ్రీనరీ పనులు పూర్తయ్యాయి. మిగతా విల్లాల్లో ఇంటీరియర్, గ్రీనరీ, ల్యాండ్ స్కేపింగ్, విద్యుద్దీకరణ పనులు జరుగుతున్నాయి. వీటిని అతి త్వరలో పూర్తి చేసేందుకు యాడా కసరత్తు చేస్తోంది. కొండపైన విల్లాలు, కింది భాగంలో రిటైనింగ్ వాల్ నిర్మించి పచ్చదనం కోసం మొక్కలను పెంచుతున్నారు.

వసతి గృహాల చుట్టూ గ్రీనరీ

కోల్‌కతా ఫర్నీచర్

విల్లాల నిర్మాణంలో చిన్న చిన్న మార్పులు, చేర్పులను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రెసిడెన్షియల్ సూట్ రెండు అంతస్తులు 13వేల ఎస్‌ఎఫ్‌టీలో నిర్మాణం చేశారు. ఇందులో 6 పడక గదులు, వెయిటింగ్ హాల్, డైనింగ్ హాల్, కిచెన్‌తో పాటు సేదతీరడానికి సిట్ అవుట్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఉడెన్ ప్లాస్టిక్‌తో తయారు చేసిన కిటికీలు, టేకుతో చేసిన ద్వారాలను బిగించారు. విల్లాల్లో ప్లంబింగ్ పనులు, బాత్ రూమ్, వంట గదులకు సంబంధించి చిన్న చిన్న పనులు చేపట్టాల్సి ఉంది. అదనపు ఆకర్షణ కోసం కోల్‌కతాలో టేకుతో తయారు చేసిన ఫర్నిచర్ తీసుకువచ్చారు.

అతిథి గృహాల ఏరియల్ వ్యూ

వారికోసమే..

సెంట్రల్ ఏసీ పడక గదులు, సెన్సార్ సిస్టమ్ గ్లాస్, టేకు ద్వారాలు, పూల మొక్కలు తదితర హంగులతో యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయానికి వచ్చే ప్రముఖుల బస కోసం ప్రెసిడెన్షియల్ సూట్, విల్లాలను నిర్మిస్తున్నారు. ఈ నెల చివరికల్లా పూర్తి చేసేందుకు అధికారులు, కాంట్రాక్టర్లు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన సూట్, 13 విల్లాలు దాదాపు పూర్తి కావొచ్చాయి. యాదాద్రీశుడి ఆలయ అభివృద్ధిలో భాగంగా అధునాతన వసతులతో ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మిస్తున్నారు. రాష్ట్రపతి, ప్రధాని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర ప్రముఖులు వచ్చినప్పుడు బస చేయనున్నారు.

రింగ్‌ రోడ్ నుంచి నేరుగా వచ్చేలా..

యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకునేందుకు వచ్చే అతిథుల కోసం వసతి గృహాలు నిర్మిస్తున్నాం. 14 మంది దాతల సహకారంతో 13 ఎకరాల్లో నిర్మించాం. వీవీఐపీ అతిథి గృహాల్లో సెన్సార్ సిస్టమ్‌ ఏర్పాటు చేస్తున్నాం. యాదాద్రి క్షేత్రం, ఇతర కట్టడాలు కనిపించేలా విల్లాలను నిర్మించాం. ఈ పనులన్నీ పూర్తి కావొచ్చాయి. ప్రెసిడెన్షియల్ సూట్‌కు ఇరువైపులా పచ్చదనం కోసం చెట్లు నాటుతున్నాం. ప్రెసిడెన్షియల్ సూట్‌తో పాటు విల్లాల కోసం కోలకతాలో ప్రత్యేక బృందం టేకుతో తయారు చేసిన ఫర్నిచర్‌ను తీసుకువచ్చాం. రింగ్ రోడ్ నుంచి నేరుగా ప్రెసిడెన్షియల్ సూట్‌కు చేరుకునే విధంగా రోడ్ల నిర్మాణాలను పూర్తి చేస్తున్నారు.

-గీతా రెడ్డి, ఆలయ ఈవో

ఈనెలాఖరుకల్లా పనులు పూర్తి

నార్త్ విల్లాలోని ఒకదానిని పూర్తి చేసి అందులో అద్భు తంగా కనిపించేలా ఫర్నిచర్‌తో పాటు పలు చిత్రాలను ఏర్పాటు చేశారు. ఆ చిత్రాలను సీఎం కేసీఆర్ ముందుకు వైటీడీఏ అధికారులు తీసుకెళ్లినట్లు సమాచారం. యాదాద్రి పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఆధునిక హంగులతో అతిథుల కోసం వసతి గృహాలను నిర్మిస్తున్నారు.

ఇదీ చదవండి: YADADRI: స్వర్ణ వర్ణ శోభితమయం.. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ ఆలయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.