ETV Bharat / state

యాదాద్రీశుడి దర్శనాలు నిలిపివేత.. వెలవెలబోయిన ఆలయ పరిసరాలు - తెలంగాణ వార్తలు

రాష్ట్రంలో లాక్​డౌన్ అమలవుతోన్న నేపథ్యంలో యాదాద్రీశుడి దర్శనాలను నిలిపివేశారు. స్వామి వారి నిత్య కైంకర్యాలు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. భక్తులతో నిత్యం సందడిగా ఉండే ఆలయ పరిసరాలు లాక్​డౌన్​తో నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి.

yadadri sri lakshmi narasimha swamy darshan suspended, lock down in yadagri gutta
శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దర్శనాలు నిలిపివేత, యాదగిరిగుట్టలో లాక్​డౌన్
author img

By

Published : May 12, 2021, 8:50 PM IST

రాష్ట్రంలో లాక్​డౌన్ అమల్లోకి రావడంతో నేటి నుంచి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దర్శనాలు నిలిపివేశారు. ఈ నెల 21 వరకు భక్తుల దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. అంతరంగికంగా స్వామివారి నిత్య కైంకర్యాలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ప్రధాన రహదారి, వైకుంఠ ద్వారం (మెట్ల దారి) వద్ద జన సంచారం లేక బోసిపోయాయి. భక్తులతో నిత్యం రద్దీగా ఉండే ఆలయ పరిసరాలు నేడు వెలవెలబోయాయి.

పట్టణంలోని బస్టాండ్, రహదారులు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. చౌరస్తా వద్ద పోలీసుల పహారా కాస్తున్నారు. రోడ్ల మీదకు వచ్చిన వాహనాలపై ఆరా తీస్తున్నారు. యాదాద్రి అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నిర్మానుష్యంగా కనిపించింది.

ఇదీ చదవండి: మంత్రి కేటీఆర్ అధ్యక్షతన కొవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.