ETV Bharat / state

YADADRI: అత్యద్భుతంగా యాదాద్రి.. ముమ్మరంగా ఇత్తడి తొడుగులు - తెలంగాణ వార్తలు

శ్రీలక్ష్మీనరసింహస్వామి(sri lakshmi narasimha swamy) క్షేత్రం అత్యద్భుతంగా ముస్తాబవుతోంది. ప్రధాన ఆలయ తొలి ద్వారానికి ఇత్తడి తొడుగులు అమర్చుతున్నారు. పునర్నిర్మాణ పనులను యాడా(YADA) వేగవంతం చేసింది. వారం రోజుల్లో తాపడం పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు.

YADADRI, sri lakshmi narasimha swamy
యాదాద్రి ఆలయం, శ్రీలక్ష్మి నరసింహ ఆలయం
author img

By

Published : Jul 9, 2021, 2:18 PM IST

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి (YADADRI sri lakshmi narasimha swamy) క్షేత్రం అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటోంది. ద్వారాలకు తాపడం, దర్శన వరుసల నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ప్రధాన ఆలయ తొలి ప్రాకారంలోని ఉత్తర దిశ ద్వారానికి... ఆర్కిటెక్ట్‌ ఆనందసాయి పర్యవేక్షణలో ఇత్తడి తొడుగులు(Brass gloves) బిగిస్తున్నారు. పెంబర్తి కళాకారులతో తొడుగులు తయారు చేయించారు.

YADADRI, sri lakshmi narasimha swamy
ముమ్మరంగా ఇత్తడి తొడుగులు

వారంలోగా పనులు పూర్తి

ఆధ్యాత్మిక, ఆహ్లాదం కలిగేలా.. ముఖ్యమంత్రి కేసీఆర్(cm kcr) సూచనలతో బంగారు వర్ణంతో.. దర్శన వరుసలకు మందిర రూపమిస్తున్నారు. వారంలోగా పనులు పూర్తి చేస్తామని ఆనంద్ సాయి వెల్లడించారు.. ప్రధాన ఆలయ రక్షణ గోడకు రంగులద్దే పనులు ముమ్మరం చేశారు. కృష్ణ శిల నిర్మాణాలకు తగ్గట్లుగా రక్షణగోడలకు అదే రూపం వచ్చేలా రంగులు వేస్తున్నారు. రాజస్థాన్ జయపుర నుంచి తెప్పించిన ఐరావత ప్రతిమలను అమరుస్తున్నారు.

YADADRI, sri lakshmi narasimha swamy
బంగారు వర్ణంలో వైష్ణవ చిహ్నాలు

హైందవ సంస్కృతి చాటేలా...

ఎక్కడా లేని తరహాలో అల్యూమినియం, ఇత్తడి కోటింగ్‌తో వాతావరణానికి అనుగుణంగా స్వామి దర్శన వరుసల సముదాయాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. పంచ నారసింహుల దివ్య దర్శనం కోసం వెళ్లే భక్తులకు హైందవ సంస్కృతిని చాటేలా వైష్ణవ చిహ్నాలతో సిద్ధమవుతోంది. మరో వారంలోగా ఈ పనులు పూర్తి కానున్నట్లు అధికారులు తెలిపారు.

YADADRI, sri lakshmi narasimha swamy
ఐరావత ప్రతిమలు

ఇదీ చదవండి: స్వర్ణ వర్ణ శోభితమయం

భవన సముదాయ విస్తరణ పనులు

భక్తులు వేచి ఉండే క్యూ కాంప్లెక్స్ భవన సముదాయ విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. వీటితో పాటు కొండపై అభివృద్ధి పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు యాడా ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. క్షేత్ర సందర్శనకు వచ్చిన యాత్రికులు ఆలయానికి చేరే దశలో ముందస్తుగా వేచి ఉండేందుకు ప్రత్యేక సముదాయాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. వాస్తు రీత్యా ఆ సముదాయాన్ని విస్తరించాలని యాడా నిర్ణయించింది. ఆ మేరకు విస్తరణ పనులను చేపట్టినట్లు ఈఈ వెంకటేశ్వర రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: జోరుగా కొనసాగుతున్న యాదాద్రి పునర్నిర్మాణ పనులు

రక్షణ గోడ నిర్మాణం

యాదాద్రి పుణ్యక్షేత్రాభివృద్ధిలో భాగంగా ప్రధానాలయ రక్షణ గోడకు టెక్సాస్ పెయింటింగ్ పనులు ముమ్మరం చేశారు. ఐరావత రూపాలు అమర్చుతున్నారు. నల్లరాతితో నిర్మించిన ఆలయానికి తగ్గట్లుగా రక్షణగోడను కృష్ణశిలతో పోలిన రంగుతో తీర్చిదిద్దుతున్నారు. ఇందుకు దక్షిణ దిశలోని రక్షణగోడకు ఇప్పటికే టెక్సాస్ పెయింటింగ్ వేశారు. ప్రస్తుతం పడమటి దిశలో రంగులు వేస్తున్నారు.

ఇదీ చదవండి: Yadadri: గోల్డెన్ టెంపుల్లా మారిన యాదాద్రి

హరితమయం

ఈ క్షేత్రానికి వచ్చే యాత్రికుల కోసం ఏర్పాటైన రహదారుల్లో ఇరువైపులా మానసిక ప్రశాంతత కలిగించేలా హరితమయంగా(greenery) ఇప్పటికే యాడా అధికారులు తీర్చిదిద్దారు. యాదాద్రికి 6 కి.మీ. దూరంలోని రాయగిరి నుంచి రహదారులన్నీ హరితమయంగా దర్శనమిస్తూ స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు రాకపోకల్లో ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. మృగ నరహరి కొలువై ఉన్న కొండ చుట్టూ ఆకుపచ్చదనంతో ప్రకృతి అందం ప్రస్ఫుటమయ్యేలా వివిధ మొక్కలు, పచ్చిక బయళ్లతో రూపొందించారు. కొండకు దక్షిణ దిశలో రాతి కనిపించకుండా పచ్చదనంతో నిండిపోయింది. యాదాద్రి(yadadri)కి వచ్చిన భక్తులకు ఆధ్యాత్మికతో పాటు ఆహ్లాదాన్ని కలిగించే విధంగా యాడా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

ఇదీ చదవండి: Yadadri: ఆధ్యాత్మిక, ఆహ్లాద కేంద్రంగా యాదాద్రి.. హరితహారంతో మరింత సుందరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.