యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానములో శనివారం రాత్రి కురిసిన వర్షానికి ప్రసాదాల కౌంటర్లో భారీగా లడ్డూలు తడిసిపోయాయి. రూ. 20కి విక్రయం జరిపే సుమారు 800 లడ్డూలు వానకు తడిసిపోయాయి. ఆలయాధికారులు వాటిని బయటకు తరలించారు. భక్తులకు విక్రయాలు జరపకుండా కౌంటర్లో నుంచి తీసివేసినట్లు అధికారులు పేర్కొన్నారు. సుమారు రూ. 16 వేలకు పైగా నష్టం వాటిల్లినట్లు తెలస్తోంది. లడ్డూలను ఎక్కడికి తరలించారనే విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు.
ఇదీ చూడండి: హుజూర్నగర్ ఉపఎన్నికలో 'స్థానిక' నేతల గిరాకీ