యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట నుంచి పెద్ద కందుకూరు వెళ్లే రహదారి పూర్తిగా పాడైపోయింది. ఎక్కడ చూసినా గుంతలు, గతుకులతో రోడ్డంతా దెబ్బతిన్నది.
ఈ దారిలోనే పలు పరిశ్రమలు ఉండడం... అలాగే వరంగల్ నుంచి యాదాద్రికి వచ్చే భక్తులకు ఇది అడ్డదారి కావడం వల్ల నిత్యం వేల సంఖ్యలో వాహన రాకపోకలు సాగుతుంటాయి.
ఈ రోడ్డుపై వెళ్లడం ప్రమాదమని తెలిసినా... తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తూ… రోడ్డు మరింత అధ్వాన్నంగా తయారైందని వాపోతున్నారు.
రాత్రి సమయాల్లో ద్విచక్రవాహనాలపై నుంచి పడి చాలా మంది గాయపడ్డారని... ఇప్పటికైనా బంధిత అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయించాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి: 'దేశంలోనే తెలంగాణ అతి తక్కువ పరీక్షలు చేస్తుంది'