యాదాద్రి భువనగిరి జిల్లాలో గత రెండు రోజులుగా కురిసిన వర్షానికి యాదాద్రి కొండపైకి వెళ్లేందుకు తాత్కాలికంగా ఏర్పాటుచేసిన మట్టిదారి అస్తవ్యస్తంగా మారింది. మట్టిరోడ్డుపై కంకర తేలి.. భక్తులు నడిచేందుకు అవస్థలు పడుతున్నారు. కొండపైన పాత కమాన్ నుంచి బాలాలయం వరకు ఉన్న మట్టికొట్టుకుపోయి నడవడానికి వీలుకాని విధంగా మారింది. అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేయాలని భక్తులు కోరుతున్నారు.
యాదాద్రిలో ప్రస్తుతం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గంటలోపలే స్వామి వారి దర్శనం జరుగుతోంది. ఆలయ అభివృద్ధి పనుల కారణంగా కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు.
ఇదీచూడండి: rain in yadadri:యాదాద్రిలో భారీ వర్షం.. భక్తుల ఇబ్బందులు