Venus Transit In Sagittarius 2024 : వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గమనం ఎప్పుడూ స్థిరంగా ఉండదు. గ్రహాలు తమ గమనాన్ని మార్చుకున్నప్పుడల్లా ఆ ప్రభావం కొన్ని రాశులపై ఉంటుంది. గ్రహాల గమనం కొన్ని రాశులకు శుభ ఫలితాలను ఇస్తే మరికొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఉండవచ్చు. ఈ క్రమంలో విలాసాలకు, సుఖ సంతోషాలకు అధిపతి అయిన శుక్రుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారనున్నాడు. ప్రస్తుతం వృశ్చిక రాశిలో ఉన్న శుక్రుడు నవంబర్ 7వ తేదీన ధనస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. ధనుస్సు రాశిలో శుక్ర సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి
శుక్రుడు ధనుస్సులో సంచారం కారణంగా ప్రధానంగా మేష రాశి జాతకులకు అదృష్టం వరిస్తుంది. ఈ సమయంలో మేష రాశి జాతకుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు వస్తాయి. శారీరక మానసిక పరిస్థితి కూడా బాగుంటుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు మంచి లాభాలు పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు కూడా ఈ సమయంలో వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది. ప్రతి శుక్రవారం లక్ష్మీ పూజ చేయడం మంచిది.
కన్య రాశి
ధనుస్సు రాశిలో శుక్ర సంచారం కారణంగా కన్య రాశి జాతకులు అదృష్టవంతులు అవుతారు. ఈ శుక్ర సంచారం కన్య రాశి వారి జీవితంలో గణనీయమైన మార్పులను తెస్తుంది. ఆర్థికంగా కన్యా రాశి వారు ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు తమ ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రతి శుక్రవారం అష్టలక్ష్మి స్తోత్రం పారాయణ చేస్తే సత్ఫలితాలు ఉంటాయి.
కుంభ రాశి
ధనుస్సులో శుక్ర సంచారం కారణంగా లాభపడే మరో రాశి కుంభ రాశి. కుంభ రాశి వారికి ఈ శుక్ర సంచారం అత్యంత శుభాలను ఇస్తుంది. శుక్ర సంచారం కారణంగా కుంభ రాశి జాతకులు ఆర్థికంగా లబ్ధి పొందుతారు. నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి. గతంలో నిలిచిపోయిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ప్రభుత్వపరంగా రావలసిన డబ్బు, ఇతర మొండి బాకీలు వసూలవుతాయి. ఆకస్మిక ధన లాభాలకు కూడా ఆస్కారముంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ప్రతి శుక్రవారం కనకధారా స్తోత్రం పారాయణ చేయడం శుభకరం.
జ్యోతిష్య శాస్త్ర పరంగా గ్రహాల గతులు మారినప్పుడల్లా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. అలాగని మిగతా వారు నిరాశ పడాల్సిన అవసరం లేదు. చేసే వృత్తిని దైవంగా భావించి కష్టించి పని చేసే వారికి విజయలక్ష్మి, ధనలక్ష్మి ఎప్పుడు అండగా ఉంటుందన్న సంగతి మరువద్దు. కృషి మాత్రమే విజయానికి రాచబాట! శుభం భూయాత్!
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.