యాదాద్రి అనుబంధ ఆలయం పాతగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో అధ్యయణోత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉదయం నిత్యా ఆరాధనలు చేశారు. పాంచరాత్రాగమ సంప్రదాయ రీత్యా ఆలయ అర్చకులు, పారాయణికులు, వేదపండితులు స్వామి అమ్మవార్లకు తిరుమంజనం నిర్వహించారు. ఉత్సవ మూర్తులను సాయంత్రం సేవపై ఉరేగించి తొళక్కముతో ప్రారంభించారు.
ఆళ్వారాదుల దివ్యప్రబంధ పారాయణం నిర్వహించారు. ఈ నెల ఇరవై ఒకటో తేదీ వరకు అధ్యయణోత్సవాలు కొనసాగనున్నాయి.
ఇదీ చూడండి: 'రామోజీ ఫిల్మ్‌సిటీ'లో పర్యాటకుల సందడి