యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం కింద వెలసిన గంఢభేరుండ నరసింహ ప్రాంగణాన్ని తీర్చిదిద్దే పనులను యాడా ప్రారంభించింది. కృష్ణశిలతో ప్రభను ఏర్పరచి, ఇత్తడి తొడుగు (మకర తోరణం)తో తీర్చిదిద్దారు. భక్తులు దర్శించుకునేలా శిల కింద ఉన్న స్వామి రూపాన్ని తైలవర్ణంతో తీర్చిదిద్దాలా లేదా ఇంకా ఎలా చేస్తే బాగుంటుందని యాడా అధికారులు స్థపతులతో చర్చిస్తున్నారు.
చినజీయర్‌స్వామి సలహాలతో గంఢభేరుండ నరసింహస్వామి ప్రాంగణం తుదిరూపం దాల్చనుంది. మరోవైపు ప్రధానాలయంలో ప్రవేశమార్గం వద్ద ఉన్న ఆంజనేయస్వామి మందిరాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు యాడా చర్యలు చేపడుతోంది.