ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులకు తిప్పలు తప్పడం లేదు. తాలు, తేమ సాకుతో కొనుగోళ్లు నిలిపి వేస్తుండటంతో.. వ్యయ ప్రయాసలకోర్చి యంత్రాలతో ధాన్యాన్ని తూర్పార పడుతున్నారు. కొనుగోళ్ల జాప్యంతో యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు ఐకేపీ కేంద్రం వద్ద అన్నదాతలు.. రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు.
గాలిమర సాయంతో..
రైతులు.. ట్రాక్టర్కు గాలి మరను అమర్చి ధాన్యాన్ని కూలీలతో ఆరబెట్టిస్తున్నారు. అందుకు గంటకు రూ.800 నుంచి రూ.900 వరకు చెల్లించాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం.. కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్ లాంటి కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: రైతులకు నష్టాన్ని మిగిల్చిన అకాల వర్షాలు