Yadadri Collector Pamela satpathy : యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి రెండేళ్ల 11 నెలల వయసున్న కుమారుడు ఉన్నాడు. ఆమె తలుచుకుంటే.. రాష్ట్రంలోని నంబర్ వన్ ప్లే స్కూళ్లో అతనికి అడ్మిషన్ చాలా సులభంగా లభిస్తుంది. కానీ ఆమె తన అధికారాన్ని ఆ విధంగా ఉపయోగించాలనుకోలేదు. అందరి పిల్లల్లా తన కుమారుడిని కూడా అంగన్ వాడీ కేంద్రానికి పంపించాలని నిర్ణయించారు. కలెక్టర్ పమేలా సత్పతి తన 35 నెలల వయసున్న కుమారుడు నైతిక్ సత్పతి పేరును అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేయించారు.
Yadadri Collector Pamela satpathy Son in anganwadi : రాయిగిరి అంగన్వాడీ టీచర్లు ఇంటింటి సర్వేలో భాగంగా బుధవారం రోజున కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి వెళ్లగా.. కలెక్టర్ తన ముద్దుల కుమారుడు నైతిక్ సత్పతి పేరును అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేయించారు. నైతిక్కు అంగన్వాడీ టీచర్లు నెలకు సరిపడా బాలామృతం, 16 గుడ్లు అందజేశారు. నైతిక్ సత్పతికి 36 నెలలు నిండిన తర్వాత అంటే మూడేళ్లు వచ్చిన తర్వాత అంగన్వాడీ కేంద్రానికి పంపనున్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!