యాదాద్రి భువనగిరి జిల్లాలో గుట్టలున్న ప్రాంతంలో కనీస వసతులు కూడా లేని స్థలాలిస్తే ప్రయోజనం ఏంటని యాదాద్రి వలయ రహదారి, భూమి బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్వం కోల్పోయి గుట్టలు, పుట్టలు పట్టుకుని ఎలా తిరగాలని వాపోయారు. మండల పరిషత్తు సమావేశంలో బాధితులతో ఆర్డీఓ భూపాల్ రెడ్డి సమావేశమై పరిహారంపై మరోమారు చర్చించారు. గజానికి పన్నెండు వేల రూపాయల పరిహారం, దాతర్పల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 152/1 నివాస స్థలాలు ఇస్తామని ఆర్డీఓ తెలిపారు.
గుట్టలున్న ప్రాంతంలో కనీస వసతులు లేని స్థలాలిస్తే ప్రయోజనం లేదని, ఆ స్థలాలు అభివృద్ధి చేసి ఇవ్వాలని బాధితులు కోరారు. ప్రభుత్వ ప్రతిపాదనలో ఆ అంశం లేదని ఆర్డీఓ చెప్పగా.. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం చెల్లిస్తేనే తాము భూసేకరణకు సహకరిస్తామని స్పష్టం చేశారు. రోడ్డుకు ఇరువైపులా.. నష్టపోకుండా ఒకవైపే రోడ్డు విస్తరణ చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.