యజ్ఞాలు, యాగాలతో గొప్ప హిందువునని చెప్పుకునే కేసీఆర్.. యాదాద్రి విషయంలో హిందూవుల మనోభావాలు దెబ్బతీశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. ఆలయ ప్రాకారాలపై రాజకీయ చిహ్నాలను చెక్కడం.. తనని తాను దేవుడితో పోల్చుకోవాలన్న సంకుచిత మనస్తత్వమేనని ఆగ్రహించారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు. కుమారుడిని సీఎం చేసుకునేందుకు కేసీఆర్ యజ్ఞయాగాలు చేస్తున్నారని ఆరోపించారు. వారం రోజుల్లోగా ఆయా శిల్పాలను తొలగించకపోతే హిందూ సంస్థలు, కర సేవకులతో కలసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి : 'ఎరువులు కూడా సరఫరా చేయలేని దుస్థితిలో కేసీఆర్ సర్కార్'