People suffer from rains: యాదాద్రి భువనగిరి జిల్లాలో రాత్రి కురిసిన వర్షానికి చెరువులు నిండి అలుగు పోస్తున్నాయి. కాలనీలల్లో ఇళ్ల మధ్య నీరు నిలిచిపోవడంతో కాలనీవాసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి కొన్ని చోట్ల రహదారులు కోతకు గురైయ్యాయి. వరదకు వరి పొలాలు నీట మునగడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
వంతెనపై నుంచి నీరు:భువనగిరి మండలం నాగిరెడ్డి పల్లి, నందనం గ్రామాల మధ్య లోలేవల్ వంతెన ( కల్వర్టు) మీదుగా వరద నీరు ప్రవహిస్తుండటం తో భువనగిరి, చిట్యాల రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ప్రవాహ వేగం ఎక్కువగా ఉండటంతో వాహనదారులు కల్వర్టు దాటడానికి ఇబ్బంది పడుతున్నారు. భువనగిరి మున్సిపాలిటీ పరిధి లోని రాయగిరి వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద వర్షానికి వరద నీరు నిలిచింది. భువనగిరి, యాదగిరిగుట్ట, భువనగిరి, మోత్కూర్ మార్గంలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
రాత్రి కురిసిన వర్షానికి భువనగిరి యాదగిరి రోడ్డుపై రాయగిరి వద్ద వర్షనీరుతో నిండిపోయింది. దీంతో జాతీయ రహదారిపై వర్షపు నీరు నిలిచిపోయింది. యాదగిరికి వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కూల్ పిల్లలు బడికి వేళ్లడానికి నానాయాతన పడుతున్నారు. కలెక్టర్ ఆఫిస్ పక్కనే ఉన్న వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గతంలో ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకొనే పాపన లేదు. అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలి.- స్థానికుడు
గ్రామల మధ్య నిలిచిపోయిన రాకపోకలు: రహదారి పూర్తిగా గుంతల మాయంగా మారిందని , గుంతల్లో నీరు నిలవటంతో గుంతలు గుర్తించలేక ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారని రాయగిరి వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భువనగిరి పట్టణ శివారులోని సింగన్న గూడెం వద్ద వరదనీరు రావటంతో ఇళ్ల మధ్యన నీరు చేరింది. భువనగిరి పట్టణ శివారులోని మాస్ కుంట వద్ద రహదారిపై వరద నీరు ప్రవహించటంతో రహదారిపై మట్టి, ఇసుక పేరుకుపోయింది. భువనగిరి మండలం అనాజీపురం, రావి పహాడ్ మధ్య లోలేవల్ వంతెన మీదుగా వరద నీరు ప్రవహిస్తుండటంతో పరిసర గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం కల్గుతోంది.
ఇవీ చదవండి: