యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం ఆజింపేట గ్రామ శివారులో లింగాల రామస్వామి తన పొలాన్ని ట్రాక్టర్‌తో చదును చేయిస్తుండగా సుమారు వందల సంవత్సరాల నాటి పురాతన గృహోపకరణాలు, ఆలయ సామాగ్రి బయటపడ్డాయి. ట్రాక్టర్ డ్రైవర్ ఈ విషయం పొలం యజమాని రామస్వామికి తెలియజేయగా.. అతను గ్రామ పెద్దలకు, పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు, తహసీల్దార్ ఆ వస్తువులను పరిశీలించారు. పురావస్తు శాఖ వారు తవ్వకాలు జరిపితే ఇంకేమైనా అవశేషాలు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇదీ చూడండి: భాజపా అగ్రనేతలతో 'మోదీ-షా' భేటీ