యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నందనం గ్రామంలో ఓ బోరు బావి ఎండిపోయి చాలా రోజులైంది. ఈ వట్టి పోయిన బోరు బావి నుంచి కొద్ది రోజులుగా నీరు పైకి వస్తోంది.
భూగర్భ జలాల నీటి మట్టం పెరగడం వల్లే నీరు బయటకు వస్తోందని రైతులు చెబుతున్నారు. ఈ సంవత్సరం నీటికి కొరత ఉండదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బోరు బావి నుంచి ఉబికి వస్తోన్న నీరును చూసేందుకు గ్రామస్థులు తరలొస్తున్నారు.
ఇదీ చదవండి: గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్న లోక్సభ స్పీకర్