వారాహి చలనచిత్ర సంస్థ అధినేత సాయి కొర్రపాటి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి భారీ విరాళం ఇచ్చారు. స్వర్ణకవచం తయారీకి 25 లక్షల రూపాయల విలువ గల 450 గ్రాముల బంగారాన్ని ఆలయ ఈఓ గీతారెడ్డి, వైటీడీఏ వైస్‌ఛైర్మన్ కిషన్‌రావుకు అందజేశారు.
బంగారంతో పాటు వాటి తయారీ నిమిత్తం ఖర్చులకు రూ. 2 లక్షల 5వేల చెక్కును అందజేశారు. వారికి ఆలయ అధికారులు బాలలయంలో స్వామి వారి ప్రత్యేక దర్శనం కల్పించి.. స్వర్ణ పుష్పార్చనతో పాటు అష్టోత్తర పూజలు నిర్వహించారు. అర్చకులు వారికి ఆశీర్చనాలు చేశారు. ఆలయ ఈఓ గీతారెడ్డి స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందించారు. వారితో పాటు ప్రముఖ రచయిత పురాణ పండ శ్రీనివాస్ ఉన్నారు.
- ఇదీ చూడండి: పసిడి వెలుగుల్లో యాదాద్రి.. పరవశంలో భక్తులు