యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో ప్రముఖులు సందడి చేశారు. అసోం అడిషనల్ చీఫ్ సెక్రటరీ భాస్కర్, దిల్లీకి చెంది క్రిబ్చో ఫెర్టిలైజర్ కంపెనీ మార్కెటింగ్ సీఆర్ వీఎస్ఆర్ ప్రసాద్ స్వామి వారిని దర్శించుకున్నారు.
ఆలయ అర్చకులు వీరికి ఘనస్వాగతం పలికారు. సువర్ణ పుష్పార్చనలో పాల్గొని స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.