యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ సైకో శ్రీనివాస్ రెడ్డి గ్రామంలో ముగ్గురు బాలికల అత్యాచారం చేసి చంపేశాడు. ఆపై వారి పేర్లను తన వ్యవసాయ క్షేత్రంలోని ఓ మేడి చెట్టుపై చెక్కాడు. ప్రస్తుతం ఆ విషయం వెలుగులోకి రావడం వల్ల గ్రామస్థులు మరింత భయపడుతున్నారు. నిందితుడు శ్రీనివాస్ గతంలో తన భూమిలో ఉన్న మేడి, వేప చెట్లకు పూజలు చేస్తుండేవాడని గ్రామస్థులు చెబుతున్నారు. చనిపోయిన బాలికల పేర్లు చెట్లపై చెక్కడంపై శ్రీనివాస్‌కి చేతబడి కూడా వచ్చేమోననే గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: భర్త కొట్టాడని కూతురితో బావిలో దూకిన ఇల్లాలు