యాదాద్రి భువనగిరి జిల్లాలో తుర్కపల్లిలో శ్రీరామోజు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణ, పెసరు లింగారెడ్డి, సహాయకుడు నాగరాజుతో కూడిన చరిత్ర బృందం పర్యటించింది. అక్కడున్న మన్నెవార్ కోట, శైవ, వైష్ణవ దేవాలయాలు, నిజాం కాలం నాటి మెట్ల బావితో పాటు అతి పురాతనమైన విశేషమైన వీరగల్లులను ఆధారాలను గుర్తించారు.
వీరగల్లులకు గుడికట్టిన ఆధారాలు ఇక్కడ ఉన్నాయని తేల్చారు. కొన్ని రాతిశిలలు వారికి కనిపించాయి. రెండు ప్రత్యేక వీరగల్లు శిల్పాలను గుర్తించారు. మొదటి వీరగల్లులో సూర్యచంద్రులు వాటి కింద ఒక ఎద్దు, దానికి ఎదురుగా పడగెత్తిన నాగుపాము గుర్తులను శిలలపై ఉన్నాయి. పాము నుంచి ఎద్దును కాపాడే క్రమంలో పోరాడి మరణించిన వీరుని స్మారక శిలగా భావిస్తున్నారు. ఇంతవరకూ తెలంగాణ రాష్ట్రంలో లభించిన వీరగల్లులో ఇప్పటివరకు ఇటువంటి వీరగల్లు ఇదే మొదటిది. రెండవ వీరగల్లులో పెద్ద పులులతో పోరాడుతున్న వీరుడు కనిపించాడు.
తెలంగాణలో వీరులు పెద్ద పులులతో పోరాడే దృశ్యాలు ఉన్న వీరగల్లు కూడా ఐదు లోపు లభించాయని.. మూడవ వీరగల్లులో వీరుని తలమీద సూర్యచంద్రులున్నారు. ఇలా వీరగల్లులపై లోతుగా పరిశీలన చేస్తే చరిత్రకారుల గురించి ఇంకా విలువైన సమాచారం దొరకవచ్చని భావిస్తున్నారు.
- ఇదీ చూడండి: మాడు పగిలిపోయేలా నిప్పులు కురిపిస్తున్న సూరీడు