ETV Bharat / state

అండర్​పాస్​లో నీళ్లు.. అవతలివైపు పోయేదెట్ల? - అండర్​బ్రిడ్జి కింద నీళ్లు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఎదుల్లగూడెం రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి కింద తరచుగా నీరు నిలిచి పోతుండటం వల్ల ఎదుల్లగూడెం గ్రామంతో పాటు, పరిసర గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చిన్నపాటి వర్షానికే రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి కిందకు వరద నీరు చేరుతుంది. అంతే కాకుండా చుట్టుపక్కల ఉన్న పంట పొలాల్లోని వరద నీరు కూడా రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి కిందకు చేరి.. రైల్వే బ్రిడ్జి పట్టాల సమీపం వరకు వరద నిలిచిపోతుంది.

Valigognda Underpass Filled With Rain Water
అండర్​పాస్​లో నీళ్లు.. అవతలివైపు పోయేదెట్ల?
author img

By

Published : Sep 21, 2020, 3:26 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి - చిట్యాల మార్గంలో ఎదుల్లగూడెం రైల్వే స్టాప్​ ఉంది. అక్కడి నుంచి ఒక కిలోమీటర్ వెళ్తే ఎదుల్లగూడెం గ్రామానికి చేరుకోవచ్చు. అందుకోసం.. గ్రామ సమీపంలోని రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిని దాటాలి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైల్వే అండర్ బ్రిడ్జి కింద తరచూ నీరు చేరుతుంది. ఫలితంగా ఆ మార్గంలో ప్రజలు రాకపోకలు సాగించలేని పరిస్థితి నెలకొంది.

4 చక్రాల వాహనాలకు ఇబ్బందే..

దాదాపు 18 ఫీట్లు ఎత్తు ఉన్న రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి కింద దాదాపు 14 ఫీట్ల వరకు నీరు నిలిచింది. సమీప గ్రామాల ప్రజలు బ్రిడ్జి కింద వర్షపు నీరు నిలవడం వల్ల రైల్వే ట్రాక్ పైనుంచి, రాకపోకలు సాగిస్తున్నారు. రైల్వే ట్రాక్ దాటడానికి వాహనదారులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కార్లు, ట్రాక్టర్లు, లారీలు గ్రామాలకు వెళ్లే పరిస్థితి లేదు. ఎవరైనా ఆరోగ్యం బాగాలేక వైద్యం చేయించుకోవాలంటే.. రైల్వే ట్రాక్ వరకు ఒక వాహనంలో వచ్చి అక్కడి నుంచి.. మరో వాహనాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిందే.

సుమారు 4వేల మందికి సమస్య

భువనగిరి - చిట్యాల మార్గంలో ఎదుల్లగూడెం స్టాప్ నుంచి ఎదుల్లగూడెం, ఆవాస గ్రామం చైతన్యపురి, ప్రొద్దుటూరు, ఎద్దుల గూడెం గ్రామాలకు వెళ్లాల్సిన వారంతా రైల్వే అండర్ బ్రిడ్జి కింద నుంచి వెళ్లాల్సిందే. నీరు ఎక్కువగా ఉన్నప్పుడు ట్రాక్ పైనుంచి నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. ద్విచక్రవాహనాలు ట్రాక్ దాటాలంటే పట్టాల మీదుగా ఆపసోపాలు పడాల్సిందే. ఎదుల్లగూడెం, పొద్దుటూరు గ్రామాల్లో దాదాపు నాలుగైదు వేల జనాభా ఈ మార్గం గుండానే ప్రయాణించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాత్రివేళల్లో అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాలంటే అష్టకష్టాలు పడాల్సిందే.

పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

ఎదుల్లగూడెం, పొద్దుటూరు గ్రామాలకు కొత్తగా వెళ్తున్న వాళ్ళు రైల్వే అండర్ బ్రిడ్జి కింద నిలిచిపోయిన నీటిని అంచనా వేయడంలో పొరపాటు పడి , ఈ నీటిలోనే కార్లు, ట్రాక్టర్లు నిలిచిపోయిన ఘటనలు గతంలో చాలాసార్లు జరిగాయి. స్థానిక ఎమ్మార్వో, స్థానిక రైల్వే అధికారులకు ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఈ సమస్యను పరిష్కరించలేదని వారు వాపోతున్నారు.

డిజైన్​లో లోపం వల్లే సమస్య

రైల్వే అండర్ ప్రాస్ బ్రిడ్జి కింద ఉన్న నీటిని తోడడానికి పైప్​లైన్ నిర్మాణంలో ఉన్నా తోడుతున్న నీటి కంటే.. రెట్టింపు నీరు వచ్చి చేరుతుంది. ఒకసారి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి కిందికి వచ్చిన నీటిని తొలగించడానికి రోజు కంటే ఎక్కువ సమయం తీసుకుంటుందని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఇంజినీరింగ్ డిజైన్ లోపం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని పరిసర గ్రామ ప్రజలు అంటున్నారు. భూమిపై ఉన్న రైల్వే పట్టాలు దాదాపు 18 ఫీట్ల కంటే ఎక్కువ లోతులో ఉండటం వల్ల నీరు పూర్తిగా అందులోనే నిలిచిపోతుందని స్థానిక ప్రజలు అంటున్నారు. దీనికి పరిష్కార మార్గంగా నీటిని తోడడాడానికి మోటార్ సామర్ధ్యం పెంచాలని కోరుతున్నారు. పంటపొలాల్లోని నీరు కూడా రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి కిందకు చేరకుండా రైల్వే అధికారులే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: యాదాద్రి ఆలయ భద్రతా సిబ్బందికి మెడికల్​ కిట్లు అందజేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.