ETV Bharat / state

యాదాద్రి విశిష్ట అద్భుత నిర్మాణాలివే..

మాడవీధులు, సప్త, పంచ, త్రి తలల గోపురాలు, కృష్ణశిలలు... ఈ పదాలు అంతతేలిగ్గా అర్థం కావు. మామూలు సాధారణ జీవితానికి చెందిన పదాలు కావుగానీ... ఓ అద్భుత నిర్మాణానికి చెందిన అంశాలవి. దేశవ్యాపిత ప్రజలంతా ఎదురుచూస్తున్న యాదాద్రి భవ్యనిర్మాణానికి చెందినవి. యాదాద్రి విశిష్ట అద్భుత నిర్మాణాలవి.

author img

By

Published : Mar 26, 2021, 7:15 AM IST

yadadri temple
యాదాద్రి విశిష్ట అద్భుత నిర్మాణాలివే..
యాదాద్రి విశిష్ట అద్భుత నిర్మాణాలివే..

" కొండగుహల్లో కొలువుండీ కోటి కాంతులా వెలిగేవూ" అని ఆర్తిగా చేసే ఆలాపనలోని నరసింహస్వామి నేడు నవనిర్మాణ దేవస్థానంలో కొలువవుతున్నాడు. “స్వయంభువుడై వెలసి - సకలజగమ్ములనేలుతున్న యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి" ని భక్తులు ఇప్పుడు మాడవీధుల వాస్తుపూర్వక మందిరాన కొలుచుకోనున్నారు. పదునాలుగు భువనాలెల్ల పాలించే పరమాత్మను అర్చించేందుకు తీర్థయాత్రీకులు ఏడంతస్తుల, ఐదంతస్తుల, మూడంతస్తుల రాజగోపురాల గుడిలోకి వెళ్తారు.

ఏడు రాజగోపురాలు

ప్రధాన ఆలయ విస్తరణలో ఏడు రాజగోపురాలు నిర్మితమయ్యాయి. పశ్చిమ రాజగోపురం 77 అడుగుల్లో రూపొందించారు. దీన్నే సప్తతల రాజగోపురం అంటున్నారు. ఇక ఉత్తరం, తూర్పు, దక్షిణ రాజగోపురాలు... 55 అడుగుల్లో నిర్మిస్తున్నారు. వీటిని అయిదు అంతస్తుల పంచతల రాజగోపురాలుగా పిలుస్తారు. ఈ నాలుగు కాకుండా మరోకటి మూడంతస్తుల రాజగోపురం కూడా సిద్ధమైంది. ఇక ఏడోదైన దివ్య "విమానం" 48 అడుగుల ఎత్తుతో రూపుదిద్దుకుంది. ఇది ప్రధాన గుడి గర్భాలయం పైన నిర్మితమైంది. అంతరాలయం గర్భగృహ ముందున్న మహాముఖమంటపం ఓ రాజప్రాసాదంలా రెండు అంతస్తులతో అలరారుతూ ఉంటుంది. లో గర్భగృహానికి ముందున్న మహాముఖమంటప స్తంభాలకు ఆన్చి ఉన్న 18 అడుగుల ఎత్తుండే విగ్రహాకృతులుగా 12 మంది ఆళ్వార్లను ఏర్పాటు చేశారు.

సప్తతల మహారాజగోపురం

నరసింహస్వామి పశ్చిమాభిముఖంగా స్వయంభువుగా వెలిశాడు కనుక పశ్చిమ మాడ వీధిలో సప్తతల మహారాజగోపురం ఉంది. దానిముందు వేంచేపు మండపం స్వామివారి పల్లకీ, రథ యాత్రలకు, ఊరేగింపులకు వెళ్లేముందు, తిరిగి వచ్చాక కాసేపు సేదతీరేందుకు ఏర్పాటు చేశారు. నలువైపులా పశ్చిమ ఉత్తర, తూర్పు, దక్షిణ మాడవీధులలో అష్టభుజి మండపాలు, స్తంభ, బాలస్తంభాలపై పౌరాణిక కథాఘట్టాల శిల్పాలు, రాజులకాలం నాటి చారిత్రక విశేషాల శిల్పాలు, సమకాలీన సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే శిల్పభాషలో చరిత్రను నమోదు చేసినంత ఘనంగా శిల్పాలను చెక్కారు. తూర్పు మాడవీధిలో ఆగ్నేయదిశలో బ్రహ్మోత్సవ మండపం, ఆ మండప ఉత్సవాలకు ప్రత్యేక పంచలోహ క్యూలైన్లను ఏర్పాటు చేశారు.

నాలుగు దిక్కులా అంతర మాడవీధులు

వేంచేపు మంటపం మాడవీధిలోంచి గానీ, అటునుంచి ఉత్తర, తూర్పు మాడవీధులలోకి అలా నడిచివెళ్లి తూర్పువైపున ఉన్న పంచతల రాజగోపురంలోంచి అంతరాలయ ప్రవేశం చేస్తారు. అలా లోపలికి వెళ్లిన భక్తులకు నాలుగు దిక్కులా నాలుగు అంతర మాడవీధులు వాటిలోనూ అంతరప్రాకార మంటపాలు కనువిందు చేస్తాయి. ఇక్కడా వాస్తుయుక్తంగా ఈశాన్యాన నిత్య కళ్యాణమంటపం, ఆగ్నేయాన దీపారాధనల మంటపం, నైఋతి దిశలో యాగశాల, వాయువ్యదిక్కున స్వామివారి అద్దాల మంటపం ఉంటాయి. ఈ ప్రాకార మంటపాలలో, యాలీ స్తంభాలు, అష్టలక్ష్మీరూపాలు, దశావతారాలు, వైష్ణవ సాలహార మూర్తులు విజయనగర, చోళ, ద్రావిడశైలీ శిల్ప అందాలు విరబూసి ఉంటాయి. అలా ఆలయ పరిసర అందాలను చూస్తూ తన్మయభరితులవుతూ అంతరాలయ ప్రవేశానికి ఏర్పాటయిన త్రితల గోపురానికి భక్తులు చేరుకుంటారు. ఆ ద్వారం లోంచి అంతరాలయంలోకి ప్రవేశించి, క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు.

అచ్చెరువొందేలా తయారైన పుణ్యక్షేత్రం

పన్నిద్దరు ఆళ్వారుల ముందు నుంచి క్యూలైన్లలో గర్భాలయంలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఆ దారిలోనే పన్నెండు మంది వైష్ణవాచార్యుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. వీరిని దర్శించుకుంటూ క్యూలైన్లలో నడుస్తూ గర్భాలయం ముందుకొచ్చేస్తారు. నారసింహుని తలుచుకుంటూ అలా తల పైకెత్తితే 10 పంచలోహ పలకలపై ప్రహ్లాదచరితం కానవస్తుంది. భక్తిపరత్వంతో గర్భాలయ మూలవిరాట్టుని చూసి తన్మయ భరితులవుతారు. ఇలా యాదాద్రి పుణ్యక్షేత్రం... అందరూ అచ్చెరువొందేలా తయారైంది.

ఒకే జాతి శిలలతో నిర్మాణం

కృష్ణశిల, నల్లని రాయి, నల్లరంగులో ఉన్న రాళ్లన్నింటినీ పోగేసి కాస్త ఇసుక, సున్నం కలిపి అంటిపెట్టడం కాదు యాదాద్రిలో జరిగింది. ఒకే జాతి రాయి , అదీ జియోగ్రాఫికల్‌ ప్రాధాన్యతే కాదు, ఆధ్యాత్మికత, పౌరాణిక ప్రాశస్త్యాల కృష్ణశిలలను ఆధారశిల నుంచి శిఖరాల గోపురాల చివరి అంచువరకూ ఒకే జాతి శిలలతో నిర్మించిన విశిష్ట ఆలయం ఇది. ఓ చిన్న అంశమే అయినా ఈ ఆలయ నిర్మాణ శిల్ప చాతుర్యాన్ని ఎత్తిపడుతుంది. ఈ నూతన నారసింహాలయాన్ని పరికించి చూస్తే శిల్పులు , స్తపతులు చేపట్టిన నిర్మాణ శైలిలో సంప్రదాయ, ఆధునిక రీతులను మేళవించారనిపిస్తుంది. కొన్ని ఆలయాల నిర్మాణంలో చేపట్టిన స్టోన్‌ లాకింగ్‌ సిస్టమ్‌, రాతి అయస్కాంతాకర్షణలననుసరించి అంటిపెట్టుట వంటి వాటిని పరిశీలించిన స్తపతులు యాదాద్రి ఆలయ నిర్మాణంలో సిమెంట్​. ఇసుకల కలయికల మిశ్రమాన్ని కాకుండా కరక్కాయ, బెల్లంపాకం, కలబందరసం, గానుగసున్నం, జనపనార గుజ్జు, కొద్దిచోట్ల సీసం వంటి వాటితో తయారుచేసిన మిశ్రమంతో శిలను శిలను అనుసంధానించే పదార్థంగా వినియోగించారు. దీంతో శతాయుష్మాన్‌ భవ అని మాత్రమే కాదు సహస్రాయుష్మాన్‌ భవ అని ఈ ఆలయాన్ని దీవించినట్లయ్యింది. వెయ్యేళ్లపాటు చెక్కుచెదరినంత నిర్మాణనాణ్యతను పాటించారు.

ఇదీ చదవండి: తిరుమలలో శ్రీవారికి వైభవంగా తెప్పోత్సవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.