యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలీటీ కేంద్రంలో కుటుంబంతో నివాసముంటున్న ఆ ఎంపీ డాక్టర్ రఘువర్ధన్ స్వతహాగా జంతు ప్రేమికుడు. ఆయన.. తన నివాసంలో ఎన్నో రకాల జంతువులు, పక్షులను ప్రేమతో పెంచుకుంటున్నారు. వాటిని కూడా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారు.
శనివారం వినాయక చవితిని పురస్కరించుకుని వీరు పెంచుకునే తాబేలును వాహనంగా చేసి వినాయకుడిని ఇల్లంతా తిప్పారు. గణనాథుడిని అలాగే తాబేలుపై ఉంచి స్వామికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు చిన్ని విఘ్నేశ్వరుడు నట్టింట్లో తిరుగుతుంటే.. సాక్షాత్తు భగవంతుడే తిరుగుతున్నట్లు సంతోషంగా ఉందని రఘువర్ధన్ ఆనందం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : శ్రీశైలం అగ్నిప్రమాదం ఘటనలో తొమ్మిది మంది మృతి