ఉద్యోగ ఉపాధ్యాయ జీతాల్లో కోతలు విధించడాన్ని నిరసిస్తూ.. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి హాజరై మద్దతు పలికారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే ఉద్యోగుల జీతాల్లో విధించిన కోతలను తొలగించి పూర్తి వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కోతలు విధించటం సరికాదు
ధనిక రాష్ట్రంగా చెప్పుకునే కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించటం సరికాదని అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను పూర్తి స్థాయిలో చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వచ్చే జీతం తక్కువని.. సగం వేతనం చెల్లించడం వల్ల ఆర్థిక సమస్యలు పెరుగుతాయని నర్సిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మే నెల జీతాన్ని పూర్తిగా చెల్లించాలని కోరారు.
ఇదీ చూడండి: రంగనాయక, మల్లన్న సాగర్ల భూసేకరణపై హరీశ్ సమీక్ష