యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఈవో గీతారెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్థానిక తెరాస నేతలు సీఎస్ జోషికి వినతి పత్రం అందజేశారు. ఈవో గీతారెడ్డి.. స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత విషయంలో ప్రొటోకాల్ పాటించడం లేదని వారు ఆరోపించారు.
రాష్ట్ర సర్కార్ వేలకోట్లు ఖర్చు పెట్టి యాదాద్రిని పునర్నిర్మిస్తుంటే.. ఈవో గీతారెడ్డి... ఆలయ అభివృద్ధి పనుల్లో స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం కల్పించడం లేదని తెరాస నేతలు ఆరోపించారు. పలు ఆలయ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేను ఆహ్వానించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆలయ అభివృద్ధి పనులను తన బినామీ కాంట్రాక్టర్లకు ఇచ్చి ఈవో గీతారెడ్డి అవినీతికి పాల్పడుతున్నారని తెరాస నాయకులు ఆరోపించారు. ఆమెపై సత్వరమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనితారామచంద్రన్, సీఎస్ జోషిలను కోరారు.
- ఇదీ చూడండి : బుడిబుడి ప్రయోగాలట.. చంద్రయానే ఆదర్శమట!