ETV Bharat / state

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణా సిబ్బందికి శిక్షణ షురూ - యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కోసం అధికారులకు, సిబ్బందికి భువనగిరి పట్టణంలో శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో 54 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ ఖిమ్యానాయక్ పేర్కొన్నారు.

training to mlc election staff at bhuvanagiri
ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణా సిబ్బందికి శిక్షణ షురూ
author img

By

Published : Mar 2, 2021, 5:13 PM IST

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు.. యాదాద్రి భువనగిరి జిల్లాలో 54 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ ఖిమ్యానాయక్ పేర్కొన్నారు. ఎన్నికల సిబ్బంది, సెక్టార్, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు భువనగిరి పట్టణ శివారులోని వెన్నెల కళాశాలలో శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఎన్నికల విధుల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ.. నిబంధనలు పాటించాలని కలెక్టర్ అన్నారు. సిబ్బందికి విలువైన సూచనలు అందించారు. భువనగిరి డివిజన్​లో 34, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్​లో 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 38,367 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ నాగలక్ష్మి, శ్యామ్ సుందర్ రెడ్డి, రవికుమార్, జిల్లాస్థాయి శిక్షకులు కడారి నర్సిరెడ్డి, హరినాథ్ రెడ్డి, ఎస్​వీ రామరాజు, నరేందర్ రెడ్డి, ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చూడండి: అడవి పందుల వలలో.. ఎలుగుబంటి పడింది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.