కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమను వెంటనే మూసేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట విద్యార్థులు ,ప్రజలు ధర్నా చేశారు. చౌటుప్పల్ పురపాలక పరిధి తంగడపల్లిలోని జంతు కళేబరాల వ్యర్థాలతో వ్యవసాయ ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. ఆ పరిశ్రమ నుంచి గత కొన్ని నెలలుగా విపరీతమైన దుర్వాసన, కాలుష్యం వెలువడుతున్నాయని స్థానికులు ఆందోళనకు దిగారు.
ఎన్ని సార్లు అధికారులకు వినతి పత్రాలు సమర్పించినా, కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్ల ప్రజలు, విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమ నుంచి వెలువడుతున్న దుర్వాసనను భరించలేకపోతున్నామని, కలుషితమైన గాలి పీల్చుకోలేక సతమతమవుతున్నామన్నారు. వెంటనే పరిశ్రమను తరలించాలని ఆర్డీవోకు వినతి పత్రం అందించారు.
ఇవీ చూడండి : దివ్యాంగుడికి ఎన్‌ఆర్‌ఐల ఆర్థిక సాయం