తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దుతున్నారని టీఎన్జీవోఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. అందుకు సీఎం కేసీఆర్కు రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరంచుకుని స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఇప్పటికే ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయగా.. ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.
2021 సంవత్సరంలో ఉద్యోగులందరికీ ఎటువంటి కష్టాలు లేకుండా చూసుకుంటామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలిపిన ఘనత ఉద్యోగులదని అన్నారు. ముఖ్యమంత్రి తమ సేవలను గుర్తించి తప్పకుండా 11వ వేతన సవరణ సంఘం వేతనాలను అందజేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెనక్కి రప్పించాలని కోరినట్లు తెవిపారు.
ఇదీ చదవండి: 'నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడం సంతోషంగా ఉంది'