ETV Bharat / state

'సమస్యల పరిష్కారానికి ఎన్నికలను వేదిక చేసుకోవాలి' - యాదాద్రి భువనగిరి జిల్లా తాజా వార్తలు

పట్టభద్రులు తమ ఆలోచనలను వ్యక్తం చేయటానికి ఎమ్మెల్సీ ఎన్నికలను కీలకంగా భావించాలని... వరంగల్-నల్గొండ-ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థి, తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమ పొరుబిడ్డల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.

tjs president Kodandaram participated MLC campaign in Yadadri Bhuvanagiri district
'సమస్యల పరిష్కారానికి ఎన్నికలను వేదిక చేసుకోవాలి'
author img

By

Published : Mar 2, 2021, 1:34 AM IST

పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ఒక వేదికగా వినియోగించాలని... వరంగల్-నల్గొండ-ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థి, తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమ పొరుబిడ్డల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి... అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు.

ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి...

ప్రభుత్వం ఎల్ఆర్ఎస్​ను తీసుకువచ్చి , సామాన్యులను ఇబ్బందులకు గురిచేసిందని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని కోదండరాం పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఎగువ భాగంలో నిర్మించాల్సి ఉన్నప్పటికీ... దిగువకు నిర్మించడంతో ప్రాజెక్టు వ్యయం పెరిగిందని తెలిపారు. లక్షా 7 వేల పోస్టులు భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ప్రకటించారని... కానీ ఇప్పటి వరకు నియామకాలు చేపట్టలేదని విమర్శించారు.

ఇలాంటి తెలంగాణను కోరుకోలేదు...

కేసీఆర్ ఫాం హౌస్​లో వెంచర్ కోసం రోడ్డు వెడల్పు పనులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో న్యాయవాద దంపతులను అన్యాయంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సరైన ఫిట్ మెంట్​తో పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎంతో మంది అమరుల బలిదానాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించామని... ఇలాంటి తెలంగాణను మనం కోరుకోలేదన్నారు.

ఇదీ చదంవండి: ఆడుకోవడానికని వెళ్లారు.. విగతజీవులై కనిపించారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.