యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలుప్రాంతాల్లో బుధవారం ఈదురు గాలులతో కురిసిన వర్షం మామిడి రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. కోతదశకు వచ్చిన మామిడికాయలు నేలరాలాయి.
మామిడి తోటలోని కాయలు కోతదశకు వచ్చిన తరుణంలో అకాల వర్షాల ధాటికి రాలిపోవడం చూసి రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దెబ్బతిన్న కాయలను మార్కెట్లో అమ్మినా కొనరని వాపోతున్నారు. ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీచూడండి: విశాఖ ఘటనపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష