యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కోరారు. బంక్‌ను రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
" బ్యాంకు ద్వారా నెలకొల్పిన బంకు కాబట్టి ఎక్కువ లాభాపేక్ష లేకుండా పని చేస్తారు. రైతులు లాభపడేలా, అలాగే సొసైటీకి నష్టం రాకుండా బ్యాలన్స్ చేస్తూ వ్యాపారం నిర్వహిస్తారు. ప్రస్తుతానికి ఇతర బంకులతో పోలిస్తే ధర తక్కువ ఉంది. నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా డీజిల్, పెట్రోల్‌ను అందిస్తున్నారు. ప్రైవేటు బంకులు అయితే లాభాలను ఆశించి వ్యాపారాలు చేస్తాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే మొదటి బంకు కాబట్టి బంకును ఆదర్షవంతంగా అభివృద్ధి పరచాలి. అందుకు చుట్టుపక్కల గ్రామాల రైతులు సహకరించాలి."
-గాదరి కిషోర్ కుమార్, తుంగతుర్తి ఎమ్మెల్యే
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ ఛైర్మన్ కంచర్ల రామకృష్ణా రెడ్డి, భువనగిరి జిల్లా డీసీఓ వెంకట్ రెడ్డి, పీఏసీఎస్ ఛైర్మన్ కంచర్ల అశోక్ రెడ్డి, జడ్పీటీసీ సిగొరుపల్లి శారదా సంతోష్ రెడ్డి, మార్కెట్ వైస్ ఛైర్మన్ కొణతం యాకూబ్ రెడ్డి, తెరాస నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఐటీ వికేంద్రీకరణకు కృషి చేస్తున్నాం : మంత్రి కేటీఆర్