చంద్రగ్రహణం సందర్భంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఇవాళ సాయంత్రం 6.30 నిమిషాలకు మూసివేయనున్నారు. బుధవారం తెల్లవారుజామున ఐదు గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి సంప్రోక్షణ చేస్తారు. అనంతరం స్వామి వారికి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తారు.
మంగళవారం సాయంత్రం 6.30 నుంచి బుధవారం ఉదయం 9గంటల వరకు భక్తులకు ఎలాంటి దర్శనాలు ఉండవని ఆలయ ప్రధానార్చకులు నల్లందిగల్ లక్ష్మీనరసింహ చార్యులు తెలిపారు. ఆర్జిత సేవలు, సుప్రభాతం, అభిషేకాలు, అర్చనలు, శ్రీ సుదర్శన నరసింహ హోమం సైతం రద్దు చేయబడ్డాయని చెప్పారు. బుధవారం ఉదయం 9గంటల నుంచి యథావిధిగా స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని ప్రధానార్చకులు తెలిపారు.
ఇదీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా గురుపూర్ణిమ వేడుకలు