ETV Bharat / state

మోత్కూరులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ - యాదాద్రి భువనగిరి జిల్లా తాజా వార్త

కరోనా విజృంభిస్తోన్న సమయాన విద్యార్థులకు ఎటువంటి ఆటంకం రాకుండా ఇంటి వద్దే ఉంటూ పాఠాలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం తలపెట్టింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు జిల్లాపరిషత్​ ఉన్నత పాఠశాలలో మున్సిపల్​ ఛైర్​ పర్సన్ సావిత్రి మేఘారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు అంజయ్యతో కలిసి విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు.

text books distributions to the govt school students at motkuru in yadadri bhuvanagiri district
మోత్కూరులోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ
author img

By

Published : Jul 25, 2020, 7:45 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ ఛైర్​పర్సన్ సావిత్రి మేఘారెడ్డి హాజరై విద్యార్థులకు పుస్తకాలు అందించారు. విద్యార్థులు పాఠ్య పుస్తకాలను ఉపయోగించుకుని.. విద్యాశాఖ ప్రసారం చేస్తున్న టీ-శాట్ టీవీ ఛానల్లో వస్తున్న పాఠాలను జాగ్రత్తగా విని నేర్చుకోవాలని సూచించారు.

ఏవైనా సమస్యలు వచ్చినట్లయితే, ఉపాధ్యాయులను చరవాణి ద్వారా సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవాలని తెలియపరిచారు. తిరిగి పాఠశాలలు ప్రారంభించే వరకు ఇంటి వద్దే క్షేమంగా ఉండి పాఠాలను అభ్యసించాలని ప్రధానోపాధ్యాయులు అంజయ్య పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.